ETV Bharat / international

'చైనా.. అందుకు సహకరించాల్సిందే' - కరోనా మూలాలు

కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి అవసరమైన సమాచారాన్ని చైనా పారదర్శకంగా పంచుకోలేదని విమర్శించారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌. భవిష్యత్తులో కరోనా తీవ్రత తగ్గించాలంటే దాని మూలాలు కనుగొనాలని, అందుకు చైనా సహకరించాలని స్పష్టం చేశారు.

blinken on origins of virus
వైరస్​ మూలాలపై బ్లింకెన్
author img

By

Published : Jun 7, 2021, 11:57 AM IST

కొవిడ్‌ మూలాలపై లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ అన్నారు. ఈ విషయంలో చైనా జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి అవసరమైన సమాచారాన్ని చైనా పారదర్శకంగా పంచుకోలేదని విమర్శించారు.

భవిష్యత్తులో కరోనా తీవ్రత తగ్గించాలంటే దాని మూలాలు కనుగొనాలని బ్లింకెన్​ చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న దర్యాప్తులను పక్కకు పెట్టి కొవిడ్‌ మూలాలపై కొత్తగా దర్యాప్తు చేపట్టాలన్నారు. మహమ్మారి గురించి తన దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని చైనా ఇవ్వడంతో పాటు..దర్యాప్తులో అంతార్జాతీయ పరిశీలకులకు సహకరించాలని బ్లింకెన్‌ స్పష్టం చేశారు.

వైరస్​ను చైనా శాస్త్రవేత్తలే సృష్టించారని బ్రిటన్‌, నార్వే శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఇటీవలే తేల్చి చెప్పింది. గబ్బిలాల నుంచి కరోనా ఉద్భవించిందని నమ్మించేలా ప్రయత్నాలు చేసిందని వెల్లడించింది. ఈ అధ్యయనం అనంతరం కరోనా మూలలపై పరిశోధనలు చేయాలనే డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్​తో జరిగిన నష్టానికి చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) నుంచి అమెరికా సహా ప్రపంచ దేశాలు పరిహారం, జవాబుదారీతనాన్ని డిమాండ్​ చేయాలని ట్రంప్ ఇటీవలే పిలుపునిచ్చారు. కనీసం 10 ట్రిలియన్​ డాలర్లను చైనా పరిహారం కింద చెల్లించాలని అన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ మూలాలపై ప్రస్తుతం బ్లింకన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి: 'భారత్​కు సరిపడా వ్యాక్సిన్లు అందించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.