అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఇటీవల పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఉద్యమానికి మద్దతు కూడగట్టటం సహా.. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ న్యూయార్క్ నగరంలోని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనం ముందు వీధిలో 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' పెయింటింగ్ వేశారు. అయితే.. వారం రోజల వ్యవధిలోనే ఈ పెయింటింగ్‌పై మూడు సార్లు దాడులు జరిగాయి. పలువురు దానిని చెరిపేసేందుకు ప్రయత్నించారు.
తాజాగా ఇద్దరు మహళలు నల్ల రంగు తీసుకొచ్చి పెయింటింగ్‌ను చెరిపేందుకు ప్రయత్నించారు. సీసీటీవీలో ఈ సంఘటనను పరిశీలించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.
ట్రంప్‌కు మద్దతుగా..
శుక్రవారం ముగ్గురు వ్యక్తులు పెయింటింగ్‌పై నీలం రంగు పోశారు. అంతకుముందు ఓ మహిళ దానిపై ఉమ్మి వేయటం వంటివి కెమెరాల్లో నమోదయ్యాయి. ముగ్గురి చేతులు, బట్టలకు ఉన్న రంగును బట్టి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు 'ఆల్ లైవ్స్ మ్యాటర్' అంటూ ఉన్న చొక్కా ధరించి ఉన్నాడు.
ఇదీ చూడండి: జాతి దుర్విచక్షణతో నల్లకలువల ఆక్రందన