ETV Bharat / international

రాకెట్​లను మోసుకెళ్లగల పెద్ద విమానం సిద్ధం

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం విజయవంతంగా తొలి ప్రయాణం పూర్తి చేసుకుంది. ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే రాకెట్లను మోసుకెళ్లి, గాల్లో నుంచే ప్రయోగించేలా దీన్ని రూపొందించారు.

రాకెట్​లను మోసుకెళ్లగల పెద్ద విమానం సిద్ధం
author img

By

Published : Apr 14, 2019, 12:45 PM IST

Updated : Apr 14, 2019, 3:32 PM IST

రాకెట్​లను మోసుకెళ్లగల పెద్ద విమానం సిద్ధం

ప్రపంచంలోకెల్లా అతి పెద్ద విమానం విజయవంతంగా తొలి ప్రయాణం పూర్తి చేసుకుంది. ఆరు బోయింగ్ 747 ఇంజన్లు అమర్చిన స్ట్రాటోలాంచ్ విమానం కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిపై శనివారం తొలిసారి ప్రయోగాత్మక ప్రయాణించింది.

దాదాపు రెండున్నర గంటలపాటు ఈ విమానం గాల్లో ఎగిరిందని స్ట్రాటోలాంచ్​ సంస్థ తెలిపింది. ఇంతకుముందు వరకు కేవలం నేలపైనే పరీక్షలు జరిగాయి.

"తొలి ప్రయాణమే ఓ అద్భుతం. గరిష్ఠంగా గంటకు 304 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది ఈ భారీ విమానం. 17 వేల అడుగుల ఎత్తు.. అంటే 5,182 మీటర్లు పైకి ఎగిరింది."

-జీన్ ఫ్లాయడ్, స్ట్రాటోలాంచ్ సీఈఓ

'స్కేల్డ్ కాంపోజిట్స్' అనే ఇంజనీరింగ్ సంస్థ ఈ విమానాన్ని రూపొందించింది. రెక్కల విస్తారం ఓ ఫుట్​బాల్ మైదానం కంటే పొడవు. అంటే ఎయిర్​బస్​ ఏ380 కంటే ఒకటిన్నర రెట్లు. ఎయిర్​ బస్ రెక్క పొడవు 80 మీటర్లలోపే. స్ట్రాటోలాంచ్​ రెక్క పొడవు 117 మీటర్లు.

విప్లవాత్మకం...

స్ట్రాటోలాంచ్ విమానానికి రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఉపగ్రహాలు ప్రయోగించే రాకెట్లను మోసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ విమానాన్ని రూపొందించారు.
స్ట్రాటోలాంచ్​ ద్వారా ఇప్పుడున్న రాకెట్​ ప్రయోగ పద్ధతికి భిన్నంగా... ఉపగ్రహాలను మరింత సునాయాసంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టొచ్చు. అందుకు కావాల్సిందల్లా కాస్త పొడవైన రన్​ వే మాత్రమే.

ఎలా ముందుకు..?
చిన్న ఉపగ్రహాలు ప్రయోగించే వ్యాపారంలోకి ప్రవేశించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ ఈ స్ట్రాటోలాంచ్ సంస్థకు ఆర్థిక సహకారం అందించారు. గతేడాది అక్టోబర్​లో ఆయన మరణించారు. ఇప్పుడీ సంస్థ భవితవ్యం ప్రశ్నార్థకమైంది.

Intro:Body:Conclusion:
Last Updated : Apr 14, 2019, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.