ETV Bharat / international

బైడెన్ 'అగ్రరాజ్య అధినేత' కల సాకారమయ్యేనా?

అమెరికా అధ్యక్షునిగా గెలవాలనే సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి? అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం గతంలో రెండుసార్లు ఎందుకు చేజారింది? వంటి విషయాలపై సమగ్ర కథనం.

Biden's long battle to uncertain White House dream
బైడెన్ 'శ్వేతసౌధ అధిపతి' కల సాకారమయ్యేనా..
author img

By

Published : Nov 3, 2020, 1:33 PM IST

Updated : Nov 6, 2020, 2:30 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ప్రత్యర్థి, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​కు 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ఆయనకు అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం దక్కింది. అందుకే ఎలాగైనా శ్వేతసౌధ అధిపతి కావాలనే చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారు అగ్రరాజ్య మాజీ ఉపాధ్యక్షుడు.

అయితే అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేని పరిస్థితుల మధ్య ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా సృష్టించిన కల్లోలం కారణంగా అగ్రరాజ్యం చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దేశంలో అశాంతి నెలకొంది. ఇలాంటి సమయంలో ట్రంప్​ను ఢీకొడుతున్నారు 77 ఏళ్ల బైడెన్​. సుదీర్ఘ కాలం సెనేటర్​గా, ఉపాధ్యక్షుడిగా తనుకున్న అనుభవంతో విజయం కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు.

అప్పట్లోనే..

బైడెన్​కు 1988లోనే తొలిసారి అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం దక్కింది. కానీ అప్పట్లో ప్రసంగం కోసం గ్రంథచౌర్యం చేశారన్న ఆరోపణలతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 2008లోనూ కొద్దిలో మరో అవకాశం చేజారింది.

opportunities

గెలిస్తే చరిత్రే..

ఒకవేళ ట్రంప్​పై బైడెన్​ విజయం సాధిస్తే అమెరికా చరిత్రలో అతిపెద్ద వయసులో అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా ఆయన నిలిచిపోతారు.

ఒబామాతో సాన్నిహిత్యం..

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో రెండు సార్లు ఉపాధ్యక్షునిగా ఉన్న బైడెన్​కు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఒబామా ఏ కీలక విషయంపై నిర్ణయం తీసుకోవాలన్నా బైడెన్​ను సంప్రదించేవారని అమెరికన్​ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్​ ప్రొఫెసర్​ లెన్నీ స్టెయిన్​బర్నే తెలిపారు.

obama's close aid
ఒబామా సోదరుడు

29ఏళ్లకే సెనేటర్​గా..

1972లో 29ఏళ్ల వయస్సులోనే సెనేట్​కు తొలిసారిగా ఎన్నికయ్యారు బైడెన్​. ఈ విజయం తర్వాత నెలరోజులకే ఆయన భార్య, కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆయన్ను విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనలో బైడెన్ ఇద్దరు కుమారులు బ్యూ, హంటర్ గాయపడ్డారు. వారు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న గది నుంచే సెనేటర్​గా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు బైడెన్​.

Biden's long battle to uncertain White House dream
రాజకీయ ప్రస్థానం

వైద్యుల హెచ్చరిక

1988లో అధ్యక్ష అభ్యర్థిగా నిలిచే అవకాశం చేజారిన కొద్ది రోజులకే బైడెన్​ రెండు సార్లు మెదడు రక్తనాళాల వాపు సమస్యతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు అప్పట్లో హెచ్చరించారు.

కుమారుడి మృతితో..

బైడెన్​ పెద్ద కుమారుడు బ్యూ బైడెన్ 2015, మేలో బ్రెయిన్ క్యాన్సర్​తో మృతి చెందారు. అనంతరం బైడెన్ కుంగిపోయారు. ఆయన రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లే అని అందరూ భావించారు. ఐదేళ్ల తర్వాత విషాదాన్ని అధిగమించి అధ్యక్ష బరిలో నిలిచారు బైడెన్. అమెరికా ప్రజలే తనను ముందుకు నడిచేలా దారి చూపారని డెమొక్రాట్ల జాతీయ సదస్సు ప్రసంగంలో తెలిపారు. జీవితంలో పరిస్థితి కొన్నిసార్లు అగమ్య గోచరంగా ఉంటుందన్నారు.

"జీవితంలో నేను రెండు విషయాలు నేర్చుకున్నాను. మొదటిది.. మీరు ప్రేమించేవారు ఈ లోకాన్ని వీడినా.. మీ హృదయాల్లో వారు ఎప్పటికీ ఉంటారు. రెండోది.. బాధ, నష్టం, దుఃఖం ద్వారా మనం ముందుకు సాగడానికి ఒక కారణం ఉంటుందని తెలుసుకున్నా."

- జో బైడెన్​.

ఆరుసార్లు...

సెనేట్​కు ఆరు సార్లు ఎన్నికైన బైడెన్.. ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. విదేశీ సంబంధాల వ్యవహారాల్లో తనదైన ముద్రవేశారు. అయితే 1994లో నేర బిల్లులో జోక్యం చేసుకున్నారని, లైంగిక వేధింపుల కేసులో అందరూ పురుషులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి.

career growth
అంచెలంచెలుగా ఎదిగి...

ముక్కుసూటి నైజం

మనసులో అనుకున్నది ముక్కుసూటిగా చెప్పే బైడెన్ నైజమే అయనకు రాజకీయాల్లో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. పలు సార్లు మీడియా సమావేశాల్లో ఆయనకు ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. బైడెన్ మాట తీరు ఈ అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా సరిపోయిందని, ట్రంప్​ను ఢీకొట్టేందుకు సరైన వ్యక్తి అని డెమొక్రాట్లు అభిప్రాయపడ్డారు. ఈ అవకాశం తన రాజకీయ జీవితంలాగే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న తర్వాత బైడెన్​కు దక్కింది.

ఆరోపణలు..

అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ముందు బైడెన్​పై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన అనేక మంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని విమర్శలొచ్చాయి. వాటిని ఖండిస్తూ ఆయన ముందుకుసాగిపోయారు.

చారిత్రక నిర్ణయం..

దక్షిణ కరోలినా ప్రాథమిక ఎన్నికల్లో ఘన విజయంతో ఆయన తిరుగులేకుండా అధ్యక్ష ఎన్నికల ప్రయాణాన్ని ముందుకు సాగించారు. కాలిఫోర్నియా సెనేటర్ కమాలా హారిస్​ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆగస్టులో ప్రకటించారు. ఒక నల్లజాతీయురాలికి ఆ అవకాశం ఇవ్వడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.

బైడెన్ ఎంపిక డెమొక్రాట్లలో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఎన్నికల్లో విజయం కోసం ముందుకు సాగేందుకు దోహద పడింది.

ప్రి పోల్స్​ లో హవా...

ఇటీవల నిర్వహించిన అన్ని సర్వేలు ట్రంప్ కంటే బైడెన్​కే అమెరికన్లు పట్టం కడుతున్నట్లు స్పష్టం చేశాయి. కరోనా కట్టడి, ఆర్థిక సంక్షోభం, దేశంలో అశాంతి వంటి వైఫల్యాలతో ట్రంప్​కు ఆదరణ తగ్గినట్లు తేలింది. ఎన్నికల విరాళాల్లోనూ బైడెనే ముందున్నారు.

joe bidens fathers details
జో బైడెన్​ వివరాలు

ఇవీ చూడండి

Last Updated : Nov 6, 2020, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.