ETV Bharat / international

'ట్రంప్‌' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన బైడెన్‌ - ట్రంప్​

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గెలుపు వ్యూహాలతో రిపబ్లికన్‌, డెమొక్రాటిక్‌ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్‌ పార్టీ మరో అడుగు ముందుకేసి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ తరఫు అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆయన పేరుతోనే వ్యంగ్యంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. అందులో ఏముందంటే..?

Biden team launched 'trumpcovidplan' website
'ట్రంప్‌' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన బైడెన్‌
author img

By

Published : Oct 26, 2020, 5:03 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడివేడీగా కొనసాగుతోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటం వల్ల రిపబ్లికన్‌, డెమొక్రటిక్‌ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇది స్మార్ట్‌యుగం.. కేవలం ప్రసంగాలతో ఎదుటి పార్టీని దెబ్బతీయలేరు. అందుకే టెక్నాలజీని, సోషల్‌మీడియాను ఎన్నికల ప్రచారంలో భాగం చేసి తమ పార్టీని ప్రమోట్‌ చేసుకోవడమే కాదు, ఎదుటిపార్టీపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ విషయంలో డెమొక్రటిక్‌ పార్టీ మరో అడుగు ముందుకేసి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ తరఫు అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆయన పేరుతోనే వ్యంగ్యంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. కరోనా నిర్మూలనకు ట్రంప్‌ ప్రణాళిక ఇది అంటూ డెమొక్రటిక్‌ పార్టీ తరఫు అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ ఇటీవల దీన్ని ప్రారంభించారు.

Biden team launched 'trumpcovidplan' website
'ట్రంప్‌' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన బైడెన్‌

ఏ ప్రణాళికలు లేవు!

గత కొన్ని నెలలుగా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. అమెరికాలోనూ మహమ్మారి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అయితే, కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్‌ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ట్రంప్‌ తన వ్యవహార శైలి మార్చుకోలేదు. తాను అనుకున్నదే చేస్తూ వెళ్తున్నారు. దీంతో డెమొక్రటిక్‌ పార్టీ ఈ అంశాన్ని నిత్యం ప్రస్తావిస్తూ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే ఎనిమిది నెలల తర్వాత కరోనాను ఓడించడం కోసం ట్రంప్‌ ఎలాంటి ప్రణాళికలు చేశారో మాకు ఇప్పుడే తెలిసింది అంటూ జో బైడెన్‌.. 'trumpcovidplan.com' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

నాట్ ఫౌండ్​..

'నమ్మండి.. ఇలాంటి ప్రణాళికను మీరు ఎప్పుడూ చూసి ఉండరు' అని వెబ్‌సైట్‌ లింక్‌ను జతచేస్తూ బైడెన్‌ ట్వీట్‌ చేశారు. ఈ వెబ్‌సైట్‌ను తెరవగానే 'Not Found' అనే పదాలు పెద్ద అక్షరాలతో కనిపిస్తాయి. 'కరోనా వైరస్‌ను నిర్మూలించి, అమెరికాను సురక్షితంగా మార్చే ప్రణాళికలేవీ ట్రంప్‌ వద్ద లేవు' అని రాసి ఉంటుంది. దాని కిందనే 'లెర్న్‌ మోర్‌' అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే.. జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కరోనా అంశంపై ట్రంప్‌ చేసిన పలు ట్వీట్లు, వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దర్శనమిస్తాయి. అధికార పార్టీ వైఫల్యాన్ని ఎత్తిచూపే క్రమంలో డెమొక్రటిక్‌ పార్టీ ఈ వెబ్‌సైట్‌ రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా సంక్షోభాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజలు కరోనాతో కలిసి జీవించడం నేర్చుకుంటున్నారని వ్యాఖ్యానించగా జో బైడెన్‌ స్పందిస్తూ.. కలిసి జీవించడం నేర్చుకోవడం కాదు.. కరోనా వల్ల ప్రజలు చావడం నేర్చుకుంటున్నారని ట్రంప్‌ వైఖరిని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి: 'ఆ దేశంతోనే అమెరికా భద్రతకు అతిపెద్ద ముప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.