ETV Bharat / international

'నా బృందంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ పరుగులు' - జో బైడెన్​

అమెరికా డెలావేర్​లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో.. తన ఆర్థిక బృందాన్ని ప్రకటించారు అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. ఇది అనుభవజ్ఞులతో కూడిన బృందమని.. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని వెల్లడించారు.

Biden says his team will create recovery for all, get economy moving again
'నా బృందంతో ఆర్థిక వ్యవస్థని పరుగులు పెట్టిస్తా'
author img

By

Published : Dec 2, 2020, 9:15 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బెడన్​.. తన ఉన్నత స్థాయి ఆర్థిక బృందాన్ని ప్రకటించారు. ఈ బృందంతో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తానని పేర్కొన్నారు. తన బృందంలో ఎందరో అనుభవజ్ఞులు ఉన్నారని.. ఫలితంగా సంక్షోభం నుంచి అందరు రికవరీ అయ్యే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

బైడెన్​ ఆర్థిక బృందంలో జానెట్​ యెల్లెన్​(కోశాధికారి), భారతీయ అమెరికన్​ నీరా టాండన్​(డైరక్టర్​ ఆఫ్​ ఆఫీస్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​ అండ్​ బడ్జెట్​), వాల్లీ ఆడెయెమొ(ఖజానా శాఖ డిప్యూటీ సెక్రటరీ), సిసిలియ రౌజ్​(కౌన్సిల్​ ఆఫ్​ ఎకనామిక్​ అడ్వైజర్​ ఛైర్మన్​), జారెడ్​ బెర్న్​స్టెయిన్​-హీథర్​ బౌషే(కౌన్సిల్​ ఆఫ్​ ఎకనామిక్​ అడ్వైజర్​ సభ్యులు) ఉన్నారు. డెలావేర్​లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీరి పేర్లను ప్రకటించారు బైడెన్​.

"ఒక్క విషయం స్పష్టంగా చెబుతున్నా. వీరితో పాటు రానున్న రోజుల్లో మరికొంతమందిని జట్టులోకి చేర్చుకుంటాం. వీరందరితో కలిసి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తాం. ఈ బృందం ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. ఎన్నో ఏళ్ల అనుభవం దీని సొంతం. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వీరు ఎన్నో సంచలనాలను సృష్టించారు. అమెరికా ప్రజల సామర్థ్యం కన్నా గొప్పది ఏది లేదు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సంక్షోభం, అసమాన ఆర్థిక పరిస్థితుల నుంచే ఓ కొత్త అమెరికా ఆర్థిక వ్యవస్థను రూపొందించవచ్చు. ఇందుకోసం అందరం కలిసిగట్టుగా పనిచేయాలి."

-- జో బైడెన్​, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత.

'ప్యాకేజీ మంజూరు చేయండి'

అమెరికా కాంగ్రెస్​ తక్షణమే బలమైన ఆర్థిక ప్యాకేజీని మంజూరు చేయాలని కోరారు బైడెన్​. కరోనా సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వారి అవసరాల కోసం ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందన్నారు. 2021 మార్చి వరకు సరపడా.. 908బిలియన్​ డాలర్ల కరోనా ప్యాకేజీని సెనేటర్ల బృందం ఇటీవలే ఆవిష్కరించిన నేపథ్యంలో బైడెన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇజీ చూడండి:- బైడెన్‌ తొలిరోజు నిర్ణయం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.