ETV Bharat / international

'అధికార బదిలీ జాప్యంతో కొవిడ్​ టీకా ఆలస్యం'

author img

By

Published : Nov 19, 2020, 11:35 AM IST

అధికార బదిలీ ఆలస్యం వల్ల వ్యాక్సిన్​ పంపిణీ ప్రణాళిక కొన్ని వారాల నుంచి నెలల పాటు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. అధికార బదిలీకి ట్రంప్​ పరిపాలన విభాగం తమతో సహకరించటం లేదని ఆరోపించారు. కరోనా పరిస్థితులపై ఆరోగ్య సిబ్బందితో వర్చువల్​ సమావేశంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Jeo biden
అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నప్పటికీ అధికార బదిలీకి ససేమిరా అంటున్నారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఎన్నికలపై ఆరోపణలు చేస్తూ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో అధికార బదిలీ ఆలస్యం వల్ల కొవిడ్​-19 వ్యాక్సిన్​ పంపిణీ ప్రణాళిక కొన్ని వారాల నుంచి నెలల పాటు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​.

కొవిడ్​-19పై ఆరోగ్య సిబ్బందితో వర్చువల్​గా నిర్వహించిన రౌండ్​టేబుల్​ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు బైడెన్​. తమ బృందానికి ట్రంప్​ పరిపాలన విభాగం ఏమాత్రం సహకరించటం లేదని ఆరోపించారు.

" మాకు ఉన్న సమస్యల్లో ఒకటి అధికార బదిలీ ఆలస్యం. ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తికి ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని రకాలా డేటా తెలియజేయాలని చట్టం చెబుతోంది. నిల్వలపై అవసరమైన సమాచారాన్ని పొందలేకపోతున్నాం. వ్యాక్సిన్​ ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా పంపిణీ చేస్తారు, తొలి ప్రాధాన్యత ఎవరికి, ప్రణాళిక ఏమిటీ అనేది తెలియాల్సిన అవసరం ఉంది. మనకు అందుబాటులో లేని చాలా విషయాలు ఉన్నాయి. అవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అమెరికన్లకు ఇచ్చిన అతిపెద్ద వాగ్దానం వ్యాక్సిన్​ పంపిణీని నిలబెట్టుకునేందుకు కొన్ని వారాలు, నెలలు జాప్యం జరిగేలా కనిపిస్తోంది. అధికార బదిలీ బృందం ఎదుర్కొంటున్న సమస్యతోనే ఈ ప్రక్రియ నెమ్మదిస్తోంది. "

- జో బైడెన్​, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత

కొవిడ్​-19 నివారణ చర్యలు వేగవంతం చేయటానికి సున్నితమైన బదిలీ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్​-19కు సంబంధించిన అన్ని కీలక సమాచారాలను పంచుకునేందుకు బైడెన్​ అధికార బదిలీ బృందంతో కలిసి పనిచేయాలని కోరుతూ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు లేఖ రాశారు.. అమెరికా ఆసుపత్రుల అసోసియేషన్​, అమెరికా మెడికల్​ అసోసియేషన్​, అమెరికన్​ నర్సెస్​ అసోసియేషన్​ల ముఖ్య కార్యనిర్వాహణ అధికారులు. పరీక్ష సామగ్రి, వెంటిలేటర్లు, పడకల సామర్థ్యం, సిబ్బంది లభ్యత వంటి వాటిపై రియల్​ టైమ్​ డేటాను పంచుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బైడెన్​కు భద్రతాంశాలు వివరించిన నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.