ETV Bharat / international

'అధికారంలోకి వస్తే హెచ్​-1బీ వీసా వ్యవస్థ ప్రక్షాళన' - biden news

భారతీయ-అమెరికన్లను ఆకర్షించడమే లక్ష్యంగా జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. తాను అధికారంలోకి వస్తే హెచ్​-1బీ వీసా వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని తెలిపారు. గ్రీన్​కార్డులకు దేశాల వారీగా ఉన్న కోటాను కూడా రద్దు చేస్తామన్నారు.

Biden promises to reform H-1B visa system, eliminate country quota for Green Cards
'అధికారంలోకి వస్తే హెచ్​-1బీ వీసా వ్యవస్థ ప్రక్షాళన'
author img

By

Published : Aug 16, 2020, 5:10 AM IST

నవంబరులో జరిగే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్​ను ఎన్నుకుంటే హెచ్​-1బీ వీసా వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని ఆయన ప్రచార బృందం తెలిపింది. గ్రీన్​కార్డులకు దేశాల వారీగా ఉన్న కోటాను రద్దు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొంది. ప్రధానంగా భారతీయ-అమెరికన్లను దృష్టిలో ఉంచుకునే బైడెన్​ ఈ ప్రకటన చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు ప్రత్యేకంగా విధాన పత్రాన్ని విడుదల చేశారు.

కుటుంబ ఆధారిక వలస విధానానికి ప్రోత్సాహం లభిస్తుందని, కుటుంబ ఏకీకరణకు మద్దతు ఇస్తామని బైడెన్​ మద్దతుదారులు తెలిపారు. శాశ్వత వీసా కోటాను కూడా పెంచుతున్నారు.

ఇదీ చూడండి: నామినేషన్​​ పత్రాలపై జో, కమల సంతకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.