ETV Bharat / international

యూఎన్​జీఏలో బైడెన్​ ఐక్యతా రాగం! - యూఎన్​జీఏ 2021

ఐరాస జనరల్​ అసెంబ్లీలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​(biden news) ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంగళవారం తన ప్రసంగంలో అంతర్జాతీయ అంశాలపై బైడెన్​ ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. 20ఏళ్ల యుద్ధానికి(అఫ్గాన్​) ముగింపు పలికి, కొత్త శకం నాందికి అడుగులు వేయాలన్న సంకల్పంతో బైడెన్​ ప్రసంగం ఉంటుందని సమాచారం. దీనితో పాటు ఈ వారం మొత్తం మీద బైడెన్​ తీరక లేని సమావేశాలతో బిజీబిజీగా గడపనున్నారు. మోదీతో సహా అగ్రనేతలతో భేటీకానున్నారు(joe biden news today).

biden
బైడెన్​
author img

By

Published : Sep 21, 2021, 11:19 AM IST

Updated : Sep 21, 2021, 11:46 AM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​(biden news).. భేటీలు, చర్చలతో ఈ వారం బిజీబిజీగా గడపనున్నారు. ఉన్నతస్థాయి సమావేశాలు, అంతర్జాతీయ నేతలతో చర్చలతో పాటు అత్యంత కీలకమైన ఐరాస జనరల్​ అసెంబ్లీలో(unga 2021) ప్రసంగించనున్నారు. అఫ్గాన్​ పరిణామాలు, కొవిడ్​ కట్టడి, టీకా పంపిణీ వంటి అంశాల నేపథ్యంలో బైడెన్​ కార్యచరణకు ప్రాధాన్యం సంతరించుకుంది(joe biden news today).

యూఎన్​జీఏలో ప్రసంగం...

సెప్టెంబర్​ 21-27 మధ్య ఐరాస సర్వసభ్య సమావేశం జరగనుంది. దేశాధ్యక్షుడి హోదాలో బైడెన్​ తొలిసారి ఇక్కడ ప్రసంగించనున్నారు. మంగళవారం జరగనున్న సమావేశం కోసం సోమవారం న్యూయార్క్​ వెళ్లారు.

అఫ్గాన్​ సంక్షోభంలో అమెరికా పాత్రపై(biden afghanistan news) ప్రపంచ దేశాలు కొంత అసహనంతో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ టీకా పంపిణీ కోసం బైడెన్​ ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలపైనా వ్యతిరేకత ఎదురైంది. కొవిడ్​ నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు, చైనాను మిలిటరీ, ఆర్థికపరంగా అమెరికా ఎదుర్కొంటున్న తీరుపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నేతృత్వంలో 'అమెరికా ఫస్ట్​' నినాదంతో ముందుకు సాగింది అగ్రరాజ్యం. బైడెన్​.. తన విధానాలతో అమెరికా సహకారం పెంపొందిస్తారని మిత్ర దేశాలు భావించాయి. అది అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల మిత్ర దేశాలు కాస్త అసంతృప్తితో ఉన్నాయి. ఈ తరుణంలో ఐరాస జనరల్​ అసెంబ్లీలో బైడెన్​ ప్రసంగం ఎలా ఉండనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి:- బైడెన్​ను కాపాడిన వ్యక్తిని అఫ్గాన్​లోనే వదిలేసిన అమెరికా!

ఈ నేపథ్యంలో బైడెన్​ ప్రసంగంపై శ్వేతసౌధం కొన్ని విషయాలు వెల్లడించింది. 20ఏళ్ల అఫ్గాన్​ యుద్ధానికి ముగింపు పడిందని, ఇక కొత్త శకాన్ని మొదలుపెట్టే సమయం వచ్చిందని.. బైడెన్​ తన ప్రసంగం ద్వారా ప్రపంచానికి తెలిజేయనున్నట్టు తెలిపింది. అదే సమయంలో కరోనా సంక్షోభంపై పోరు కోసం మిత్ర, శత్రుదేశాలను కలుపుకుని ముందుకు సాగిపోవాలన్న సంకల్పంతో ఆయన కీలక ప్రసంగం చేస్తారని పేర్కొంది.

గుటెరస్​తో భేటీ...

జో బైడెన్​.. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోని గుటెరస్​తో(antonio guterres un) భేటీ అయ్యారు. ఐరాస, సంస్థ విలువలపై తమకు విశ్వాసం ఉందని తెలిపారు. ప్రస్తుత కొవిడ్​- వాతావరణ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ దేశాలు కలిసిగట్టుగా పనిచేయాల్సిన అవసరం మునుపెన్నడూ లేనంతగా ఉందని బైడెన్​ అభిప్రాయపడ్డారు.

"అమెరికా ఈజ్​ బ్యాక్​. ఐరాస విలువలపై మాకు నమ్మకం ఉంది. ప్రస్తుతం ఉన్న కొవిడ్​, వాతావరణ సమస్యలకు అంతర్జాతీయంగా పరిష్కారాలు అత్యవసరం. ఏ ఒక్క దేశంతోనూ పని జరగదు. అందరు కలిసిగట్టుగా ముందుకు సాగాలి. విలువలు, ప్రాథమిక సూత్రాల కారణంగా అమెరికా-ఐరాస మధ్య బలమైన భాగస్వామ్యం ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బంధం అత్యంత కీలకంగా మారనుంది."

-- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు.

ఐరాసలో కీలక పాత్రకు అమెరికా కట్టుబడి ఉంటుందని బైడెన్​ హామీనిచ్చినట్టు గుటెరస్​ వెల్లడించారు.

మోదీతో భేటీ...

యూఎన్​జీఏలో ప్రసంగం అనంతరం న్యూయార్క్​లో బైడెన్​.. అమెరికా ప్రధాని స్కాట్​ మారిసన్​తో భేటీకానున్నారు. అనంతరం బైడెన్​కు సంబంధించిన సమావేశాలు వాషింగ్టన్​లో జరుగుతాయి.

బ్రిటన్​ అధ్యక్షుడు బోరిస్​ జాన్సన్​తో మంగళవారం భేటీకానున్నారు బైడెన్​. శ్వేతసౌధంలో వీరి సమావేశం జరగనుంది.

బుధవారం బైడెన్​ అధ్యక్షతన వర్చువల్​గా కొవిడ్​-19పై సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ, ఆక్సిజన్​ కొరత వంటి కొవిడ్​ సంక్షోభం అంశాలపై చర్చించనున్నారు. అంతర్జాతీయంగా టీకా పంపీణీకి ఉతమందించే విధంగా బైడెన్​.. కొత్త ప్రణాళికలు ప్రకటించే అవకాశముంది!

శుక్రవారం బైడెన్​ అధ్యక్షతన క్వాడ్​(us quad summit) సమావేశం జరగనుంది. అదే రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(modi us visit 2021), జపాన్​ ప్రధాని సుగాతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు బైడెన్​.

మరోవైపు ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​తోనూ బైడెన్​ సంభాషించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆస్ట్రేలియాతో యూఎస్​ జలాంతర్గాముల ఒప్పందంపై ఫ్రాన్స్​ అసహనంతో ఉన్న నేపథ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:- మోదీ- బైడెన్​ భేటీతో బంధం మరింత బలోపేతం'

Last Updated : Sep 21, 2021, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.