ETV Bharat / international

కీలక రాష్ట్రాల్లో ట్రంప్​పై బైడెన్​ పైచేయి - Biden leads Trump in Wisconsin, Michigan

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అగ్రరాజ్యంలోని విస్కాన్సిన్​, మిషిగన్​ రాష్ట్రాల్లో డొనాల్డ్​ ట్రంప్​ కంటే డెమొక్రటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ ముందంజలో ఉన్నట్లు తాజా సర్వేల ద్వారా తెలిసింది. ట్రంప్​, బైడెన్​ మధ్య 10 పాయింట్ల వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడైంది.

Biden leads Trump in Wisconsin, Michigan
ఆ రాష్ట్రాల్లో జో బైడెన్​ దే పైచేయి
author img

By

Published : Oct 14, 2020, 5:24 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన విస్కాన్సిన్​, మిషిగన్​ రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీ ​అభ్యర్థి జోబైడెన్​.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కంటే ముందంజలో ఉన్నట్లు తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

మిషిగన్​ రాష్ట్రంలో జో బైడెన్​ 8 పాయింట్లు ముందంజలో ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ ట్రంప్​ విజయం సాధించడం గమనార్హం.

సీబీఎస్ న్యూస్​ సర్వే :

సీబీఎస్​ న్యూస్​ సర్వేలో మిషిగన్​, నెవాడా రాష్ట్రాల్లో ట్రంప్​ ముందు వరుసలో ఉన్నారు. ట్రంప్​కు 52శాతం ఓటర్లు మద్దతు పలకగా... జో బైడెన్​కు 46 శాతం మంది జైకొట్టారు.

రియల్​ క్లియర్​ పాలిటిక్స్​ సర్వే :

రియల్​ క్లియర్​ పాలిటిక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం బైడెన్​ ముందంజలో ఉన్నారు. విస్కాన్సిన్​, మిషిగన్​ రాష్ట్రాల్లో ఈ సర్వే జరిపారు. విస్కాన్సిన్​లో బైడెన్​ 5.5 పాయింట్లతో, మిషిగన్​లో 7 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

రాయటర్స్​ సర్వే :

రాయటర్స్​ నిర్వహించిన సర్వేలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో 5 పాయింట్లతో బైడెన్​ ముందున్నారు. విస్కాన్సిన్​లో 6 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి జో బైడెన్​ 50శాతం ఓటింగ్​తో ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్​ పెన్సిల్వేనియాలో 45శాతం, విస్కాన్సిన్​లో 44శాతం ఓటర్ల మద్దతు సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.