ETV Bharat / international

సీఎన్​ఎన్​ పోల్​: ట్రంప్​పై భారీ ఆధిక్యంలో బైడెన్ - అధ్యక్షునిగా బైడెన్​కే అమెరికన్ల మద్దతు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుస్తారని ఓ సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్​ కన్నా బైడెన్​ 12 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలిపింది.

Biden holds 12 point lead over Trump in new national poll
అధ్యక్షునిగా బైడెన్​కే అమెరికన్ల మద్దతు
author img

By

Published : Oct 29, 2020, 4:02 PM IST

నవంబర్​ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్​కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ద హిల్​' పేర్కొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ కంటే బైడెన్​ 12 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలిపింది.

సీఎన్​ఎన్​ నిర్వహించిన సర్వేలో రిపబ్లిక్​ అభ్యర్థి ట్రంప్​ వైపు 42 శాతం మంది అమెరికన్లు మొగ్గు చూపగా... డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి బైడెన్​కు మాత్రం 54 శాతం మంది ఓట్లు జై కొట్టారని 'ద హిల్' కథనం ప్రచురించింది.

గత ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్​కు వచ్చిన మద్దతు కంటే ఇప్పుడు బైడెన్​కు లభించిందే ఎక్కువని స్పష్టం చేసింది. ఏడాది నుంచి సీఎన్‌ఎన్ చేపట్టిన సర్వేలన్నీ బైడెన్​కే అనుకూలంగా ఉన్నాయని గుర్తుచేసింది.

సర్వేలోని కీలకాంశాలు:

  • మహిళా ఓటర్లలో 61 శాతం మంది బైడెన్​కు ఓటు వేయనున్నారు.
  • అమెరికాలోని నల్లజాతీయులందరూ బైడెన్​కే గంపగుత్తగా ఓట్లు వేయనున్నారు.
  • మగవారిలో ట్రంప్​ కన్నా బైడెన్​కే ఎక్కువ మంది ఓటు వేయనున్నారు.
  • శ్వేత జాతీయ పురుషుల్లో ట్రంప్​ హవా నడుస్తోంది.
  • ఎప్పుడూ రిపబ్లికన్​ పార్టీకి మద్దతుగా నిలిచే వృద్ధులు ఈసారి బైడెన్​కే ఓటు వేసే అవకాశం.

ఇదీ చూడండి: అమెరికా ముందస్తు గోల- పోస్టల్‌ బ్యాలెట్లపై కోర్టుల్లో యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.