ETV Bharat / international

'మౌలిక' అజెండాతో బైడెన్ తొలి విడత ఆర్థిక ప్యాకేజీ - అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​

అమెరికాలో ఆర్థిక ఉపశమన ప్యాకేజీ మొదటి భాగం నిధుల వినియోగానికి సంబంధించిన ప్రణాళికలను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​.. ఈ వారం విడుదల చేయనున్నారు. మౌలిక వసతుల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చించనున్నారు.

Biden
మౌలిక వసతుల నిర్మాణంపై బైడెన్​ దృష్టి!
author img

By

Published : Mar 29, 2021, 7:16 AM IST

కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికా ప్రజలను ఆదుకునేందుకు ప్రకటించిన భారీ ఆర్థిక ఉపశమన ప్యాకేజీ తొలి భాగం వివరాలను జో బైడెన్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ ప్యాకేజీలోని మొదటి భాగం నిధులతో రోడ్ల పునరుద్ధరణ, వంతెనలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణాలను చేపట్టాలని యోచిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ వారం జో బైడెన్​ విడుదల చేయనున్నట్లు అమెరికా ప్రెస్​ సెక్రటరీ జెన్​ సాకి ఆదివారం స్పష్టం చేశారు. ప్యాకేజీని రెండు భాగాలుగా విభజిస్తున్నట్లు చెప్పారు.

"కాంగ్రెస్​లో రిపబ్లికన్ల నుంచి మద్దతు పొందే ప్రయత్నంలో భాగంగా ప్యాకేజీని రెండు ప్రతిపాదనలుగా విభజించాలని చూస్తున్నాం. కానీ, ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి. దీనికోసం సెనేట్​, ప్రతినిధుల సభతో కలిసి పని చేస్తాం."

-జెన్​ సాకి, అమెరికా ప్రెస్​ సెక్రటరీ

ప్యాకేజీ రెండో భాగం నిధుల వినియోగ ప్రణాళికలను ఏప్రిల్​లో విడుదల చేస్తారని జెన్​సాకి తెలిపారు. శిశు, ఆరోగ్య సంరక్షణ రంగం కోసం ఈ నిధులను వినియోగిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: రష్యా, చైనాకు ​బైడెన్​ 'లీడర్స్​ సమ్మిట్'​ ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.