ETV Bharat / international

Biden Afghanistan: 'తరలింపు ప్రక్రియ ఆగస్టు 31లోగా పూర్తి చేసేస్తాం' - పుతిన్

ఆగస్టు 31లోగా బలగాలు, ఇతర వ్యక్తుల తరలింపు పూర్తి చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. నిర్ణయించిన తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలో అధికారి మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు అమెరికా బలగాల ఉపసంహరణపై విమర్శలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

biden, america president
బైడెన్, అమెరికా అధ్యక్షుడు
author img

By

Published : Aug 25, 2021, 12:33 AM IST

అఫ్గానిస్థాన్​ నుంచి బలగాలు, ఇతర వ్యక్తుల తరలింపు ప్రక్రియను ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని, ఈ ప్రక్రియను ఇంకా ఆలస్యం చేసే ఉద్దేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు(Biden Afghanistan) లేదని ఓ అధికారి వెల్లడించారు. అమెరికా జాతీయ భద్రతా బృందంతో చర్చించిన అనంతరం బైడెన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు.

అఫ్గాన్​లో అమెరికా వాసులపై ఉగ్రముప్పు ఉందని భావిస్తోన్న తరుణంలో బైడెన్.. తరలింపు ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. అయితే.. ఆగస్టు 31లోగా తరలింపు పూర్తి కాని నేపథ్యంలో ప్రత్యామ్నాయం కూడా ఆలోచించాలని రక్షణ అధికారులకు​ సూచించారు. ఇప్పటికే అమెరికా తరలింపు ప్రక్రియను వేగవంతం చేసిందని పేర్కొన్నారు.

విదేశీయులందరినీ, అఫ్గాన్​లో తాలిబన్ల ముప్పు ఉన్న వారిని తప్పకుండా తరలించే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలని ఐరోపా మిత్ర దేశాలు, అమెరికా ప్రజాప్రతినిధులు కొందరు, ప్రముఖ సంస్థలు, శరణార్థుల సంఘాలు బైడెన్​ను కోరుతున్నాయి.

పెంటగాన్​ ప్రతినిధి జాన్​ కిర్బీ కూడా.. బలగాల ఉపసంహరణకు అనుకున్నదానికన్నా సమయం ఎక్కువే పట్టొచ్చని తెలిపారు. కాబుల్​ నుంచి సామాగ్రి, బలగాలను తరలించడానికి మరికొన్ని రోజులు కావాలని అన్నారు.

మరోవైపు ఆగస్టు 31లోగా ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని తాలిబన్లు(taliban news) తేల్చిచెప్పారు. గడువు పొడిగించాలని అగ్రరాజ్యం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో ఈమేరకు ప్రకటన చేశారు.

దూరంగా ఉంటాం..

అఫ్గాన్​ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ వల్ల మధ్య ఆసియా దేశాలకు, రష్యాకు ఉగ్ర ముప్పు పెరిగే అవకాశముందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు. అఫ్గాన్​లోని పలు ఉగ్ర సంస్థలు తమ బలగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయని అన్నారు. దీని ప్రభావం తమ దేశంపై తీవ్రంగా ఉంటుందని తెలిపారు. అఫ్గాన్​లో నెలకొన్న గందరగోళానికి అమెరికానే కారణమని విమర్శలు చేసిన పుతిన్.. అఫ్గాన్​ నుంచి దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. సోవియట్​ యుద్ధం నుంచి రష్యా చాలా పాఠాలు నేర్చుకుందని అన్నారు.

ఇదీ చదవండి:

అమెరికాకు తాలిబన్ల వార్నింగ్​.. డెడ్​లైన్​ ఫిక్స్​

అఫ్గాన్​పై జీ7 దేశాల చర్చ- తాలిబన్లకు హెచ్చరిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.