ETV Bharat / international

Biden China: జిన్​పింగ్​కు బైడెన్​ ఫోన్​.. ఆ అంశంపైనే చర్చ.. - us china competition

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden Phone Call) గురువారం ఫోన్​లో(Biden Phone Call) మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలపై(Us China Relationship) వారు చర్చించారు. ఇరు దేశాల మధ్య వివిధ విషయాల్లో భేదాభిప్రాయాలు నెలకొన్న వేళ ఈ ఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.

biden jinping phone call
బైడెన్ జిన్​పింగ్ ఫోన్​కాల్​
author img

By

Published : Sep 10, 2021, 10:04 AM IST

అగ్రరాజ్య అధ్యక్ష పగ్గాలను జో బైడెన్(Joe Biden) ​చేపట్టాక.. అమెరికా, చైనా సంబంధాలు(China Us News) క్షీణించాయన్న విమర్శలు వినిపిస్తున్న వేళ గురువారం కీలక పరిణామం జరిగింది. చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​తో బైడెన్​ ఫోన్​లో(Biden Phone Call) మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలపై(Us China Relationship) ఇరువురూ చర్చించారు. ఇరు దేశాధినేతల మధ్య విస్త్తృత, వ్యూహాత్మక సంభాషణ జరిగిందని వైట్​హౌస్​ ఓ ప్రకటనలో తెలిపింది.

"అమెరికా, చైనా దేశాధినేతలు తమ ఉమ్మడి ఆసక్తులపై చర్చించారు. తమ ఆసక్తులు, విలువలు, దృక్కోణాలు విభిన్న అంశాలపై చర్చించారు. ఈ సంభాషణలో ఇండో పసిఫిక్​ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును అమెరికా కోరుకుంటోందని బైడెన్ చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పోటీ.. వివాదాస్పదంగా మారకుండా బాధ్యత వహించాల్సిన అంశంపై వారు చర్చించారు."

-వైట్​హౌస్.

సైబర్ భద్రతా నియమాలను చైనా ఉల్లంఘిస్తూ.. బలవంతపు/అన్యాయమైన వాణిజ్య పద్ధతులను చైనా అవలంబిస్తోందని అమెరికా ఆరోపణలు(Us China Conflict) చేస్తున్న తరుణంలో బైడెన్​, జిన్​పింగ్ మధ్య ఈ ఫోన్ సంభాషణ జరగడం గమనార్హం. అయితే.. జిన్​పింగ్​తో ఉద్రిక్తతలు నెలకొనే అంశాలపై కాకుండా.. అమెరికా, చైనా సంబంధాలపైనే ప్రధానంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. బైడెన్ అధికారంలోకి వచ్చాక.. జిన్​పింగ్​తో ఫోన్​లో మాట్లాడటం ఇది రెండోసారి.

వాతావరణ మార్పులను కట్టడి చేయడం, కొరియాలో అణు సంక్షోభాన్ని ఎదుర్కోవడం సహా ఇరు దేశాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలను పరిష్కరించే దిశగా చైనా, అమెరికా కలిసి పని చేస్తాయని ఆశిస్తున్నట్లు వైట్​హౌస్​ తెలిపింది.

ఇదీ చూడండి: భారత్​ సరిహద్దులకు దగ్గర్లో 30 విమానాశ్రయాలు!

ఇదీ చూడండి: China BRI 'చైనా చేపట్టిన ఆ ప్రాజెక్ట్​తో పర్యావరణానికి ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.