అమెరికా జాతీయ భద్రతకు రష్యాతో ముప్పు పొంచి ఉందని డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమెరికాకు అతిపెద్ద పోటీదారు చైనాయేనని అభిప్రాయపడ్డారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్.
"నా వరకు.. అమెరికా భద్రతకు రష్యాతోనే ముప్పు. చైనా మనకు అతిపెద్ద పోటీదారు. అయితే ఈ పోటీపై మన వైఖరి బట్టే పరిస్థితులు దేనికి తారి తీస్తాయనేది తెలుస్తుంది."
--- జో బైడెన్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి.
అధ్యక్ష ఎన్నికల చివరి సంవాదంలో భాగంగా.. రష్యా నుంచి బైడెన్‌కు 3.5మిలియన్ డాలర్లు అందినట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
అయితే ట్రంప్ ఆరోపణలను బైడెన్ ఇప్పటికే ఖండించారు. విదేశాల నుంచి తాను చిల్లి గవ్వ కూడా పుచ్చుకోలేదని తేల్చిచెప్పారు.
ఇదీ చూడండి:- 'ట్రంప్.. భారత్ గురించి మాట్లాడే తీరు ఇదేనా?'