ETV Bharat / international

బైడెన్​ జట్టులో మరో ఇద్దరు భారతీయులకు చోటు - US NEWS

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ బృందంలో మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు చోటుదక్కింది. శ్వేతసౌధం సీనియర్​ సిబ్బందిలో అదనపు సభ్యులుగా గౌతమ్​ రాఘవన్​, వినయ్​ రెడ్డి నియామకమయ్యారు.

Biden appoints Indian Americans
బైడెన్​ జట్టులో మరో ఇద్దరు భారతీయులకు చోటు
author img

By

Published : Dec 23, 2020, 6:15 AM IST

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న జో బైడెన్​ తన బృందంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు స్థానం కల్పించారు. చాన్నాళ్లుగా తన అనుచరుడిగా ఉన్న భారతీయ అమెరికన్​ వినయ్​ రెడ్డిని ప్రసంగాల రచయితగా, మరో భారతీయ అమెరికన్​ గౌతమ్​ రాఘవన్​ను ప్రెసిడెన్షియల్​ పర్సనల్​ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్​గా నియమించారు.

ఇదీ చూడండి: శ్వేతసౌధంలో కీలక పదవికి భారతీయ అమెరికన్

గౌతమ్​కు గతంలో శ్వేతసౌధంలో పనిచేసిన అనుభవం ఉంది. అధ్యక్షుడు బైడెన్​, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​లు శ్వేతసౌధానికి సంబంధించి మరో నలుగురితో కలిసి వినయ్​, గౌతమ్​ల నియామకాలు చేపట్టారు. వినయ్​ రెడ్డి బైడెన్​-హ్యారిస్​ ప్రచార బృందంలో సీనియర్​ సలహాదారుగా, ప్రసంగాల రచయితగా వ్యవహరించారు. ఒబామా రెండో దఫా అధ్యక్షుడు అయిన సమయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్​కు ముఖ్య ప్రసంగాల రచయితగా పనిచేశారు.

ఇదీ చూడండి: అమెరికా ఆర్థిక మండలి సభ్యుడిగా భారతీయ అమెరికన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.