ETV Bharat / international

వైట్​హౌస్​ మిలటరీ ఆఫీస్​​ డైరెక్టర్​గా భారతీయుడు - బైడెన్​ తాజా వార్తలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. తన పాలనా విభాగంలో మరో భారతీయ అమెరికన్​కు కీలక బాధ్యతలు అప్పగించారు. శ్వేతసౌధ సైనిక కార్యాలయ డైరెక్టర్​గా​ మజూ వర్గీస్​ను నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు వర్గీస్​.

Biden appoints Indian-American Director of WH Military Office
వైట్​హౌస్​ మిలటరీ ఆఫీసర్​ డైరెక్టర్​గా భారతీయ అమెరికన్​
author img

By

Published : Mar 2, 2021, 4:31 PM IST

వైట్​హౌస్​ మిలటరీ ఆఫీస్​ డైరెక్టర్​గా భారతీయ అమెరికన్​ మజూ వర్గీస్​ను నియమించారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​. వర్గీస్​.. బైడెన్​-హారిస్​ ఎన్నికల ప్రచారంలో చీఫ్​ ఆపరేటింగ్​ అధికారిగా, సీనియర్​ సలహాదారుగా సేవలందించారు. మిలటరీ ఆఫీస్​ డైరెక్టర్​గా తనను నియమించినట్టు.. లింక్డ్​ఇన్​లో పోస్ట్​ చేశారు వర్గీస్​.

శ్వేతసౌధం​ మిలటరీ కార్యాలయం అనేది.. అక్కడ జరిగే పలు అధికారిక వేడుకలు, వైద్య సదుపాయం, అత్యవసర సేవలు, అధ్యక్షుని రవాణా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వర్గీస్​ వీటికి డైరెక్టర్​గా వ్యవహరించనున్నారు.

కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు, క్యాపిటల్​ భవనంపై దాడుల నేపథ్యంలో.. బైడెన్​ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు వర్గీస్.

ఒబామా హయాంలోనూ..

గతంలో.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా సహాయక అధికారిగా ఉన్న వర్గీస్​.. ఆయన పాలనా కాలంలో శ్వేతసౌధంలో పలు విభాగాలలో బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. తాజా నియామకంతో రెండోసారి శ్వేతసౌధంలో పనిచేయనున్నారు.

ఇదీ చదవండి: హెచ్​-1బీ వీసాలపై ఎటూ తేల్చని బైడెన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.