ETV Bharat / international

బైడెన్​కు భద్రతాంశాలు వివరించిన నిపుణులు - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

అమెరికాలో అధికార బదిలీ ప్రక్రియకు అధ్యక్షుడు ట్రంప్ ఆటంకాలు కల్పిస్తున్నా.. బైడెన్- హారిస్ ద్వయం ముందుకు సాగుతోంది. దౌత్య, రక్షణ, నిఘా సమాచారాన్ని జాతీయ భద్రతా నిపుణులు వీరికి అందించినట్లు ట్రాన్సిషన్​ బృందం తెలిపింది. అయితే, ఇందులో కీలకమైన రోజువారీ నిఘా నివేదిక లేనట్లు తెలుస్తోంది.

US-BIDEN-HARRIS-BRIEFING
బైడెన్​
author img

By

Published : Nov 18, 2020, 5:27 PM IST

అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్- హారిస్ ద్వయానికి.. దౌత్య, రక్షణ, నిఘా సమాచారాన్ని జాతీయ భద్రతా నిపుణులు అందించారు. ఈ మేరకు అధికార బదిలీ బృందం స్పష్టం చేసింది. బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు విదేశాంగ విధానంపై సన్నద్ధంగా ఉండేలా ఈ రంగాల్లోని సవాళ్లను వివరించినట్లు తెలిపారు.

అయితే, ఇందులో కీలకమైన అధ్యక్షుడికి సమర్పించే రోజువారీ నిఘా అధికారిక సమాచారం లేనట్లు తెలుస్తోంది. నవంబర్​ ఎన్నికలను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తోన్న నేపథ్యంలో ఈ సమాచారాన్ని బైడెన్​కు పరిపాలన విభాగం అందించలేకపోతోంది.

నిరాకరణ..

ఇప్పటికే అమెరికా ప్రభుత్వం అధికార బదిలీ ప్రక్రియను ప్రారంభించినా.. సాధారణ సేవల విభాగం (జీఎస్​ఏ) చీఫ్​ ఎమిలీ మర్ఫీ.. బైడెన్-హారిస్​ ఎన్నికను గుర్తించలేదు. మర్ఫీని ట్రంపే నియమించారు. ఫలితంగా అధికార బదిలీ ప్రక్రియను చట్టబద్ధంగా ప్రారంభించేందుకు మర్ఫీ నిరాకరిస్తున్నారు.

ఈ విషయంలో ట్రంప్ యంత్రాంగంపై బైడెన్​ ఇప్పటికే ఆరోపణలు చేశారు. భద్రతా సమాచారాన్ని తమతో పంచుకోవటం లేదని పేర్కొన్నారు.

ఎన్నికలపై వ్యతిరేకత..

ఇప్పటికే కీలక రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపుపై ట్రంప్ చాలా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఎన్నికల్లో మోసం జరిగిందని చెప్పేందుకు సరైన ఆధారాలు అందివ్వటంలో ట్రంప్ విఫలమయ్యారు.

ఇదీ చూడండి: ట్రంప్ సహకారం లేకుండానే బైడెన్​ ముందుకెళతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.