ETV Bharat / international

బైడెన్​ బృందంలో మరో నలుగురు భారతీయులు

అమెరికా పాలనా యంత్రాంగంలో భారత సంతతి వ్యక్తులకు.. అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే పెద్ద పీట వేశారు. తాజాగా మరో నలుగురు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు అప్పగించారు.

author img

By

Published : Jan 25, 2021, 11:40 AM IST

Biden Administration appoints Indian-Americans to key posts in Energy Department
బైడెన్​ బృందంలో మరో నలుగురు భారతీయులు

అమెరికా పరిపాలన విభాగంలో భారత సంతతి వ్యక్తులకు ఇప్పటికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు అధ్యక్షుడు జో బైడెన్​. తాజాగా మరి కొంత మంది ప్రవాస భారతీయులకు కీలక పదవులు అప్పగించారు.

కీలక ఇంధన రంగంలో నలుగురు భారత సంతతి వ్యక్తులను సీనియర్‌ అధికారులుగా బైడెన్ ప్రభుత్వం నియమించింది. భారతీయ అమెరికన్‌ తారక్‌ షాను చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమించగా.. ఆ పదవిలో పనిచేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. తారక్‌ షా 2014-17 మధ్య సైన్స్‌ అండ్‌ ఎనర్జీ విభాగంలో అండర్‌ సెక్రటరీ చీఫ్‌ స్టాఫ్‌గా వ్యవహరించారు. ఒబామా సెనేట్‌, అధ్యక్ష ఎన్నికల ప్రచార బృందంలో కీలక పాత్ర పోషించారు. తన్యా దాస్‌ను సైన్స్‌ కార్యాలయానికి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గానూ, నారాయణ్‌ సుబ్రమణియన్‌ను జనరల్‌ కౌన్సిల్‌ కార్యాలయంలో న్యాయ సలహాదారునిగా నియమించారు. శుచీ తలాటిని అమెరికా శిలాజ ఇంధన కార్యాలయ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమిస్తూ బైడెన్‌ ఉత్తర్వులు జారీచేశారు. వీరితో పాటు వివిధ దేశాల మూలాలున్న 19 మందిని ఇంధన విభాగంలోని ఇతర పదవులకు ఎంపిక చేశారు.

శుద్ధ ఇంధన దిశగా అమెరికా వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో కీలక పదవులు భారతీయ అమెరికన్ల చేతికి చిక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాతావరణ మార్పుల విషయంలో పటిష్ఠ చర్యలు చేపట్టాలన్న బైడెన్‌ లక్ష్య ఛేదనలో ఇంధన విభాగం ప్రధాన పాత్ర పోషించనుంది.

ఇదీ చదవండి: బైడెన్​ బృందంలో కీలకంగా భారతీయులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.