ETV Bharat / international

అమెరికా ప్రయాణికులకు అలర్ట్.. కొత్త ట్రావెల్ రూల్స్ ఇవే - అమెరికా ట్రావెల్ రూల్స్

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి కీలక నిబంధనలను (US Travel restrictions) అమెరికా ప్రకటించింది. 18 ఏళ్లు పైబడిన విదేశీ ప్రయాణికులకు (US International Travel news) వ్యాక్సినేషన్ తప్పనిసరి కానుంది. ప్రయాణికులంతా వ్యాక్సినేషన్​తో సంబంధం లేకుండా.. కొవిడ్ టెస్టు రిపోర్టులను సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 8 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి.

us travel rules from november 8
అమెరికా నూతన ట్రావెల్ రూల్స్
author img

By

Published : Oct 26, 2021, 10:47 AM IST

అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి నవంబర్ 8 నుంచి అమలు చేయనున్న నిబంధనల (US Travel restrictions) జాబితాను బైడెన్ ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలు, నియమాలను (US Travel advisory) వెలువరించింది.

రెండు డోసులు తీసుకున్న విదేశీ ప్రయాణికులనే నవంబర్ 8 నుంచి అమెరికాలోకి (US International Travel news) అనుమతించనున్నారు. వీరంతా విమానంలో ఎక్కేముందే తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా ఎఫ్​డీఏ ఆమోదించిన టీకాలతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర అనుమతులు జారీ చేసిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి అమెరికాలోకి ప్రవేశం ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. అనుమతించిన మిక్సింగ్ టీకాలను తీసుకున్నా.. ప్రయాణాలు చేయవచ్చు.

టీకా తీసుకున్నప్పటికీ.. ప్రయాణానికి ముందు కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని (US Travel docs) సమర్పించడం తప్పనిసరి కానుంది. మూడు రోజుల లోపు పరీక్షించిన నమూనా ఫలితాలనే సమర్పించాలి. ఈ నిబంధన విదేశీ ప్రయాణికులతో పాటు అమెరికా పౌరులకు, చట్టబద్ధమైన శాశ్వత నివాసులకూ వర్తిస్తుంది.

వ్యాక్సిన్ తీసుకోనివారికీ...

పలు మినహాయింపులతో వ్యాక్సిన్ తీసుకోని విదేశీయులనూ అమెరికాలోకి (US International Travel news) అనుమతించనున్నారు. 18 ఏళ్లలోపు పిల్లలు వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకునే నిబంధన లేదు. వీరు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న 18 ఏళ్లు పైబడిన వారితో కలిసి ప్రయాణిస్తే.. మూడు రోజుల లోపు తీసిన కొవిడ్ నెగెటివ్ రిపోర్టు సమర్పించాలి. అదే, వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోనివారితో కలిసి ప్రయాణిస్తే.. కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రం 24 గంటల లోపుదై ఉండాలి. రెండేళ్ల లోపు పిల్లలకు కొవిడ్ పరీక్షలు అవసరం లేదు.

వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం.. పేపర్ ఫార్మాట్​లో లేదా డిజిటల్ రూపంలోనైనా ఉండొచ్చు. ఈ సర్టిఫికేట్​లో ప్రయాణికుడి పేరు, పుట్టిన తేదీ, వ్యాక్సిన్ రకం, డోసులు తీసుకున్న తేదీ ఉండాలి.

ఇదీ చదవండి: కరోనాతో చైనా హై అలర్ట్​- మూడేళ్ల పిల్లలకూ టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.