ETV Bharat / international

100 రోజుల్లో బైడెన్​ ఆ లక్ష్యాలను చేరుకుంటారా? - డొనాల్డ్​ ట్రంప్​

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న జో బైడెన్​కు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. అయితే అదే రీతిలో ఆయన తన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. తొలి రోజే పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. ఆయన 100 రోజుల ప్రణాళికను పెట్టుకున్నారు. తొలుత.. అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసిన కరోనా కట్టడిపైనే దృష్టి సారించనున్నారు. అయితే.. వ్యాక్సినేషన్​, ప్రజలు మాస్కులు ధరించేలా చూడటం, స్కూళ్ల పునఃప్రారంభమే తన తొలి 100 రోజుల పాలనలో కీలక లక్ష్యాలని తెలిపారు.

BIDEN 100  DAYS PLAN
100 రోజుల్లో బైడెన్​ ఆ లక్ష్యాలను చేరుకుంటారా?
author img

By

Published : Jan 20, 2021, 7:59 PM IST

కరోనాను కట్టడి చేయడమే తన ముందున్న ప్రథమ కర్తవ్యం అని పలుమార్లు స్పష్టం చేశారు అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్​. ఆ దిశగానే ముందుకెళ్లనున్నారు. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకున్నారు.

కొవిడ్​ కట్టడి చర్యల్లో భాగంగా.. తొలి 100 రోజుల్లో 10 కోట్ల మందికి టీకా ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు బైడెన్​. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి సంబంధించి కార్యచరణ ప్రణాళికపైనే ఆయన తొలి సంతకం చేస్తారని అందరూ భావిస్తున్నారు.

విద్యాసంస్థలు తెరవడమే లక్ష్యంగా..

విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ప్రాణాలను రక్షించేందుకు సరిపడా నిధుల్ని కాంగ్రెస్‌ అందించాలని కోరారు బైడెన్​. అలా అయితే, తన 100 రోజుల పాలన పూర్తయ్యే నాటికి విద్యా సంస్థలన్నీ తెరిచేందుకు కృషి చేస్తామన్నారు. మాస్కులు ధరించేలా చూడడం, వ్యాక్సినేషన్‌, స్కూళ్ల పునఃప్రారంభమే తన తొలి 100 రోజుల పాలనలో కీలక లక్ష్యాలని తెలిపారు.

ఈ లక్ష్యాలని చేరుకున్నప్పటికీ.. చేయాల్సింది ఇంకా చాలా ఉంటుందని బైడెన్‌ అభిప్రాయపడ్డారు. తన ముందుకు చాలా కిష్లమైన సవాళ్లున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ.. తన మూడు లక్ష్యాలను చేరుకుంటే మహమ్మారిపై దాదాపు విజయం సాధించినట్లేనని అభిప్రాయపడ్డారు.

బైడెన్​ బృందం లక్ష్యాలు..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్​ ముందు మరికొన్ని లక్ష్యాలున్నాయి. ప్రాథమిక లక్ష్యాల తర్వాత.. ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులపైనా నూతన అధ్యక్షుడు ​దృష్టిపెట్టనున్నారు.

పట్టాలపైకి ఆర్థికం..

కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టనున్నారు బైడెన్​. కొవిడ్​ ఉపశమన బిల్లు పేరిట దాదాపు 2 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది.

పారిస్​ ఒప్పందం..

బైడెన్​ మళ్లీ పారిస్​ ఒప్పందంలో అమెరికాను భాగం చేయనున్నారు. నవంబర్​ 4నే ఈ ఒడంబడిక నుంచి వైదొలిగింది అగ్రరాజ్యం.

ఇరాన్​పై ఆంక్షలు..

ఇరాన్​పై ట్రంప్​ ప్రభుత్వం విధించిన ఆంక్షలను.. బైడెన్​ తొలగించే అవకాశం ఉంది. 2015లో ఇరాన్​తో చేసుకున్న అణు ఒప్పందాన్ని అగ్రరాజ్యం పునరుద్ధరించనుంది. ఇదే జరిగితే టెహ్రాన్​ చేస్తున్న అణుపరీక్షలకు తాత్కాలికంగా చెక్​ పడుతుంది.

ఒబామా కేర్​..

మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా పేరిట ఏర్పాటైన ఒబామా కేర్​ పథకాన్ని.. బైడెన్​ ముందుకు తీసుకెళ్లనున్నారు. ట్రంప్​ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.

పోలీస్​​ వ్యవస్థ..

నల్లజాతీయుల నిరసనలకు కారణమైన పోలీస్​​ వ్యవస్థను నియంత్రించేందుకు నూతన అధ్యక్షుడు చర్యలు తీసుకొనే అవకాశముంది. అయితే ఆయా బిల్లులకు సభల్లో ఆమోదం లభిస్తుందా? అన్నది మాత్రం ప్రశ్నార్థకం.

రష్యాతో చర్చలు..

అమెరికా-రష్యా మధ్య నిరాయుధీకరణ విషయంలో చేసుకున్న 'న్యూ స్టార్ట్​' ఒప్పందం పొడిగించే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ అంగీకరిస్తే.. మరో ఐదేళ్లపాటు దీన్ని కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ..

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)లో అమెరికా సభ్యత్వాన్ని బైడెన్​ పునరుద్ధరించవచ్చు. ఆ సంస్థకు నిధులు కేటాయించడంపైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

నిషేధం తొలగింపు..

ముస్లిం దేశాల నుంచి అగ్రరాజ్యానికి వచ్చే వారిపై ట్రంప్​ ప్రభుత్వం ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. వాటిని తొలగించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు బైడెన్​.

సౌదీ అరేబియా, పశ్చిమాసియాలోని పలు దేశాలతో అంతర్జాతీయ సంబంధాలపై దృష్టిసారించనున్నారు బైడెన్​. యెమెన్​లో సౌదీ తలపెట్టిన యుద్ధానికి అగ్రరాజ్యం మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. 2016లో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.