అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. విజయంపై రిపబ్లికన్లు- డెమొక్రాట్లు ధీమాగా ఉన్నారు. కానీ అనేక సర్వేలు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపే దేశం మొగ్గుచూపుతున్నట్టు తేల్చేస్తున్నాయి. తాజాగా.. ఆసియా, ఆఫ్రికా, హిస్పానిక్(స్పానిష్ భాష మాట్లాడే వారు) అమెరికన్లు కూడా బైడెన్‌కే మద్దతిస్తున్నట్టు ఓ సర్వే పేర్కొంది. అమెరికన్లు మాత్రం ట్రంపై వైపే ఉన్నట్టు స్పష్టం చేసింది. అయితే ఇందులోనూ ఇరువురి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది.
సెప్డెంబర్- అక్టోబర్ చివరి వరకు.. 71వేల మందిపై ఆన్లైన్లో సర్వే నిర్వహించింది 2020 కార్పొరేటివ్ ఎలక్షన్ స్టడీ. ఇందులో బైడెన్‌కు 51శాతం మంది.. ట్రంప్‌నకు 43శాతం మంది మద్దతిస్తున్నట్టు పేర్కొంది.
18-29, 30-44 వయస్సు వారు బైడెన్‌ను ఎంచుకొంటుండగా.. 65ఏళ్ల వయస్సు గలవారు ట్రంప్‌కు ఓటు వేయనున్నట్లు సర్వే పేర్కొంది.
ఇదీ చూడండి:- ట్రంప్ పైనే భారతీయ-అమెరికన్ ఓటర్ల విశ్వాసం!
65శాతం మంది ఆసియా అమెరికన్లు బైడెన్‌కు సహకరిస్తుండగా.. కేవలం 28మంది ట్రంప్ వైపు నిలబడ్డారు. రికార్డు స్థాయిలో 86శాతం మంది నల్లజాతీయులు బైడెన్‌కు మద్దతు తెలుపుతుండగా.. ట్రంప్‌కు కేవలం 9శాతం మంది మద్దతు తెలపడం గమనార్హం. హిస్పానిక ఓటర్లు కూడా బైడెన్(59శాతం)వైపే ఉన్నట్టు సర్వే స్పష్టం చేసింది.
ఓటర్లు | బైడెన్(శాతం) | ట్రంప్(శాతం) |
మహిళలు | 55 | 39 |
పురుషులు | 47 | 48 |
డిగ్రీలేని అమెరికన్లు | 38 | 57 |
డిగ్రీ ఉన్న అమెరికన్లు | 58 | 36 |
2016లో హిల్లరీకి ఓటు వేసిన వారిలో 95శాతం మంది ఓటర్లు బైడెన్‌కే మద్దతిస్తున్నట్టు సర్వే పేర్కొంది. మరోవైపు 2016లో ట్రంప్‌నకు ఓటి వేసిన వారిలో 90శాతం మంది ఇప్పటికీ అధ్యక్షుడు వెంటే ఉన్నట్టు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- 'ఓట్లేయండి బాబు'.. అంటున్న ట్రంప్- బైడెన్