ETV Bharat / international

ట్రంప్​ కోసం 'టిమ్' పేరు మార్పు

author img

By

Published : Mar 10, 2019, 3:38 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ తన పేరును తప్పుగా ఉచ్చరించడంపై ఆపిల్ సీఈవో వినూత్నంగా స్పందించారు. ట్విట్టర్​ ఖాతా పేరులో స్వల్పమార్పు చేశారు. ఇంటిపేరు స్థానంలో ఆపిల్​ సంస్థ లోగో ఉన్న ఎమోజీని ఉంచారు.

ట్విట్టర్​ ఖాతా పేరు మార్చుకున్న ఆపిల్​ సీఈవో టిమ్​కుక్​

ఆపిల్​ సీఈవో టిమ్​కుక్​ ట్విట్టర్​ ప్రొఫైల్​ నేమ్​ను కొంచెం మార్చారు. ఇంటి పేరు స్థానంలో ఆపిల్​ సంస్థ లోగో ఎమోజీని ఉంచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, ఆపిల్​ సీఈవో 'టిమ్ కుక్'​ను పొరపాటున 'టిమ్​ ఆపిల్​'గా సంబోధించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో టిమ్​ తన ట్విట్టర్ ఖాతా పేరును కొద్దిగా మార్చారు.

బుధవారం శ్వేతసౌధంలో 'అమెరికా శ్రామిక విధాన సలహా సంఘం'తో ట్రంప్​ సమావేశమయ్యారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. ఆపిల్​ సీఈవో టిమ్​ కుక్​ అమెరికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని కొనియాడారు. ఈ సందర్భంలోనే 'టిమ్​కుక్'ను 'టిమ్​ ఆపిల్​' అని ఉచ్చరించారు.

ఇదేమీ మొదటిసారి కాదులే

ప్రముఖుల పేర్లను ఇలా మారు పేర్లతో పిలవడం ట్రంప్​కు ఇది మొదటిసారేమీ కాదు. గతంలోనూ 'అమెజాన్'​ సంస్థ అధినేత 'జెఫ్​ బెజోస్'​ను 'జెఫ్​ బోజో' అని, 'లాక్​హీడ్​ మార్టిన్​' సీఈఓ 'మార్లిన్​ హౌసన్​'ని 'మార్లిన్​ లాక్​హీడ్'​ అని తప్పుగా పలికారు. ఇలా ట్రంప్​ ప్రముఖుల పేర్లు తప్పుగా పలకడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సరదాగా మీమ్​లను షేర్ చేస్తున్నారు.

నిప్పు-ఉప్పు

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్​ ఆపిల్​ సంస్థపై ఆరోపణలు చేశారు. ఆపిల్​ సంస్థ, సామ్​సంగ్​ మాదిరిగా మంచి ఫోన్​లను తయారుచేయడంలేదని విమర్శించారు. అలాగే పారిస్​ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలన్న ట్రంప్​ నిర్ణయాన్ని టిమ్​కుక్​ వ్యతిరేకించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.