ETV Bharat / international

సింగిల్ డోసుతో 21 రోజుల్లోనే యాంటీబాడీలు

ఔషధ దిగ్గజం ఫైజర్‌-జర్మనీ బయోటెక్‌ సంస్థ, బయాన్‌టెక్‌లు సంయుక్తంగా తయారుచేస్తున్న వ్యాక్సిన్‌... ఆరోగ్యవంతులైన 18-55 ఏళ్ల వయస్కుల రోగనిరోధక శక్తిని ప్రభావవంతంగా బలోపేతం చేస్తున్నట్టు తేలింది. సింగిల్‌ డోసుతోనే 21 రోజుల్లోనే యాంటీబాడీలు కనిపించాయని పరిశోధకులు వివరించారు.

antibodies in 21 days with single dose vaccine
సింగిల్ డోసుతో 21 రోజుల్లోనే యాంటీబాడీలు
author img

By

Published : Aug 13, 2020, 7:35 AM IST

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మరో పురోగతి. ఔషధ దిగ్గజం ఫైజర్‌-జర్మనీ బయోటెక్‌ సంస్థ, బయాన్‌టెక్‌లు సంయుక్తంగా తయారుచేస్తున్న వ్యాక్సిన్‌... ఆరోగ్యవంతులైన 18-55 ఏళ్ల వయస్కుల రోగనిరోధక శక్తిని ప్రభావవంతంగా బలోపేతం చేస్తున్నట్టు తేలింది. తొలిదశ క్లినికల్‌ ప్రయోగాల్లో ఈ ఫలితాలు వచ్చినట్టు జర్నల్‌ నేచర్‌ పత్రిక పేర్కొంది.

పరిశోధకులు రోగనిరోధక శక్తిని ప్రతిస్పందింపజేసే 'బీఎన్‌టీ162బీ1' అనే ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను తయారుచేశారు. దీనిలోని కీలక పదార్థం... కరోనా రిసిప్టర్‌-డొమైన్‌లో భాగమయ్యే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసేలా జీవకణాలను అనుమతిస్తుంది. మరోవైపు, దీని ఆధారంగా యాంటీబాడీలను విడుదల చేసేలా రోగనిరోధక వ్యవస్థనూ ప్రేరేపిస్తుంది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా 18-55 ఏళ్ల వయసున్న 45 మంది ఆరోగ్యవంతులకు దీన్ని ఇచ్చారు. సింగిల్‌ డోసుతోనే వారిలో 21 రోజుల్లోనే యాంటీబాడీలు కనిపించాయని పరిశోధకులు వివరించారు.

ఇదీ చూడండి: ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపికకు కారణాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.