ETV Bharat / international

'సరికొత్త పంథాలో బైడెన్​ 'దౌత్య' పాలన' - చైనా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌.. త్వరలోనే అధికార పీఠం చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ పాలనలో అమెరికా, మిత్రదేశాల కూటమి- ఇతర దేశాలకు మధ్య దౌత్య సంబంధాలు మారుతాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మాజీ దౌత్యవేత్త అశోక్ సజ్జనార్. యూఎస్ విదేశాంగ విధానంలో అంతర్లీనంగా ఇమిడిపోయి ఉండే అంశాలను అర్థం చేసుకోడంలో విఫలమైన డోనాల్డ్ ట్రంప్ హయాంలోలాగా కాకుండా... ద్యైపాక్షిక సంబంధాల్లో స్థిరత్వం, స్పష్టత వస్తాయని ఈటీవీ భారత్‌ సీనియర్ కరెస్పాండెంట్ చంద్రకళా చౌదరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

author img

By

Published : Nov 11, 2020, 8:25 PM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించి.. తర్వలో అగ్రరాజ్యం అధ్యక్ష పీఠం అధిరోహించనున్న జో బైడెన్ పాలన.. భారత్, చైనా సహా ఇతర ప్రపంచ దేశాలకు ఎలా పరిణమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మాజీ దౌత్యవేత్త అశోక్ సజ్జనార్‌ ఈటీవీ భారత్‌తో సవివరంగా మాట్లాడారు. ముఖ్యంగా బైడెన్ ప్రెసిడెన్సీ ప్రపంచ దేశాల పట్ల ఎలా ఉండబోతోంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అనే అంశాలపై ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

బైడెన్ విజయాన్ని భారత్ సహా.. బీజింగ్ నుంచి బెర్లిన్ వరకు ఇతర దేశాలు ఎలా అన్వయించుకోవాలి?

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక అంతర్జాతీయంగా అనేక కీలక మార్పులు తీసుకురానుంది. అంతకుముందు.. సజావుగా సాగాల్సిన అంతర్జాతీయ సంబంధాలను డోనాల్డ్ ట్రంప్ చర్యలు, విధానాలు పూర్తిగా విచ్ఛిన్నం చేశాయి. మిత్రదేశాలైన ఈయూ, నాటో సభ్య దేశాలు.. ఆఖరుకు పొరుగున ఉన్న కెనడా, మెక్సికో అలాగే జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలతో ఆయన దుందుడుకుగా వ్యవహరించి వాటిని నొప్పించారు. కాబట్టి యుఎస్‌-మిత్రదేశాలకు ఇతర దేశాలకు మధ్య దౌత్య సంబంధాలు సాధారణ స్థితికి రావటం ప్రపంచం చూడబోయే మొదటి మార్పు.

ఇక దౌత్య సంబంధాల నిర్వహణలో స్థిరత్వం, స్పష్టత రాబోతోంది. విదేశీ విధానాల నిర్వహణలో ఉండే సూక్ష్మస్థాయి అంశాలు ట్రంప్‌ పట్టించుకోలేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. బైడెన్ పగ్గాలు చేపట్టారంటే ఇదంతా మారిపోతుంది. అలాగే, ట్రంప్ అనేక అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలిగారు. కీలకమైన ప్యారిస్‌ వాతావరణం ఒప్పందంలో తిరిగి చేరడం బైడెన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ముందువరసలో ఉంటుంది.

రెండోది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇందులోనూ అమెరికా తిరిగి చేరుతుందని నా నమ్మకం. ఇక ట్రాన్స్-పసిఫిక్ సహకార ఒప్పందం విషయంలో ఏం జరిగేదీ చెప్పలేం. ఎందుకంటే, ట్రంప్ ఓడిపోయినా... ట్రంపిజం దేశంలో సజీవంగానే ఉంది. 'అమెరికా ఫస్ట్' విధానం ప్రాతిపదికగా ఆయన సృష్టించిన సుంకాల అడ్డుగోడలు, విదేశీ దిగుమతుల మీద పొరుగుసేవల మీద విధించిన ఆంక్షలు, చేపట్టిన విధానాలు.. మహమ్మారి సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిన నేపథ్యంలో కొంతకాలం కొనసాగనున్నాయి.

ఈ సందర్భంగా మనం గుర్తించవలసిన అంశం ఏంటంటే.. మధ్యప్రాచ్యంలో గడచిన నాలుగేళ్లలో పెనుమార్పులు సంభవించాయి. ఇజ్రాయెల్, యుఏఈ, బహ్రెయిన్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇరాన్ ఇప్పటికే యురేనియం శుద్ధి చేపట్టిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.

ప్రజాస్వామ్యంలేని నియంత్రణ కొరవడిన చైనాకు.. బైడెన్ విజయం మరో సవాలు అవ్వనుందా?

చైనా సవాలుకు బైడెన్‌ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరమైన అంశం. చైనా నుంచి ముప్పు విషయంలో అమెరికాలో అందరిదీ ఒకటే మాట. ప్రపంచ అగ్రదేశంగా ఉన్న అత్యంత శక్తివంతమైన యునైటెడ్ స్టేట్స్‌ను ఎలాగైనా సరే ఆ స్థానం నుంచి తోసిరాజు అవ్వాలన్న దృఢసంకల్పంతో ఉన్న చైనాను... అమెరికన్లు ముప్పుగా, ప్రత్యర్థిగా మాత్రమే కాదు.. ఒక శత్రుదేశంగానూ చూస్తున్నారు. చైనాను కట్టడి చేసే విధానం ఇక మీద కూడా కొనసాగుతుంది. అయితే, వ్యూహం తీరు కొంత భిన్నంగా ఉండొచ్చు. జో బైడెన్ చైనాతో చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది. వాణిజ్య లేదా సాంకేతిక పరమైన ఒప్పందం కుదుర్చుకునే వీలూ ఉంది.

ఇలా జరగాలంటే, దక్షిణ చైనా సాగర జలాల్లో డ్రాగన్‌ను కట్టడి చేసేందుకు ఇంతకు ముందులా బలప్రదర్శన కొనసాగించాలి. అలాగే ‘చతుర్భుజి' విషయంలో కూడా చొరవ చూపించాలి. లేదంటే చైనా దాన్ని బలహీనతగా భావించి తైవాన్‌కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇది భారత్‌కూ అశనిపాతం అవుతుంది. యుఎస్ కాఠిన్యం తగ్గిందన్న భావన చైనాకు కలిగించే ఎలాంటి చర్యనూ.. ఏ విధంగానూ తీసుకోబోమన్న భరోసా జో బైడెన్ ఇవ్వాల్సి ఉంటుంది.

బైడెన్ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా అన్వయించవచ్చు, యూఎస్ కీలక మిత్రదేశాల పరంగా దాన్ని ఎలా చూడవచ్చు?

జో బైడెన్ విజయాన్ని ప్రపంచంలోని అత్యధిక దేశాలు ఎంతో సానుకూల రీతిలో స్వాగతిస్తున్నాయి. ఐరోపాకు సంబంధించినంతవరకు అన్ని యూరోపియన్ దేశాలూ బైడెన్ ఎన్నికను హర్షిస్తున్నాయి. భారత్ కూడా బైడెన్, కమలా హ్యారిస్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. యూఎస్‌తో భారత్ సంబంధాలు బైడెన్ హయాంలో మరింత బలపడతాయన్న విశ్వాసం ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. ఇక చైనా విషయానికి వస్తే, ట్రంప్ న్యాయపోరాటాలు ప్రారంభించినందువల్ల తుది ఫలితాలు వెల్లడయ్యేంత వరకూ తాము స్పందించబోమని స్పష్టం చేసింది. రష్యా, సౌదీలు బైడెన్‌ను అభినందిస్తూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. బైడెన్ పాలనలో తమకు గడ్డుకాలం తప్పదని అవి గుర్తించాయి. డెమొక్రటిక్ ప్రభుత్వం సౌదీ అరేబియాను ఎటూ ఇష్టపడదు. ఇది భారత్‌కు ఇబ్బందికరమైన అంశమే. మొత్తంగా యూఎస్ చమురు, సహజవాయువుల కోసం ఆ ప్రాంతం మీద ఆధారపడిలేదు. కాబట్టి బైడెన్ ప్రభుత్వ హయాంలో మధ్యప్రాచ్య ప్రాముఖ్యం క్షీణిస్తుంది.

చివరిగా, బైడెన్ గెలుపు భారత్-యూఎస్ సంబంధాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది?

భారత్-యూఎస్ సంబంధాలు బైడెన్ హయాంలోనూ మెరుగ్గా కొనసాగుతాయి. ఈ బలమైన భాగస్వామ్యానికి అన్ని పక్షాల నుంచి మద్దతు ఉంది. అధ్యక్షుడు డెమొక్రటిక్ లేదా రిపబ్లికన్ ఎవరైనా... గత 20 ఏళ్లుగా ఈ మద్దతు కొనసాగుతోంది. జో బైడెన్ అన్నివేళలా భారత్‌తో బలమైన సంబంధాలకు మద్దతిస్తూ వచ్చారు. భారత్-అమెరికా అణుఒప్పందమైనా, భారత్‌ను యుఎస్ ప్రధాన రక్షణ భాగస్వామిగా ఎంపిక చేసుకొనే అంశంలోనైనా.. ఆయనకు భిన్నాభిప్రాయం లేదు. అన్ని విషయాల్లోనూ బైడెన్ భారత్‌కు మద్దతుదారుగా ఉంటున్నారు. భవిష్యత్తులోనూ ఇదే వైఖరి అవలంభిస్తారు.

రక్షణ భాగస్వామ్యంలోనూ ఉభయ దేశాల సంబంధాలు మరింత బలపడతాయి. వ్యవసాయం, ఇంధనం, సైబర్ సెక్యూరిటీ, విద్య వంటి 60కి పైగా అంశాలలో భారత్‌, యుఎస్‌లు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఈ సహకారం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. అయితే, పాకిస్థాన్‌పై అమెరికా ఎలాంటి వైఖరి అవలంభిస్తుందన్నది మనం కీలకంగా చూడాలి. వాణిజ్య అంశాల్లో భారత్‌కు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఇమిగ్రేషన్ వీసాల విషయంలో ట్రంప్‌కంటే బైడెన్ మెరుగైన నిర్ణయం తీసుకుంటారని ఆశించాలి. మానవ హక్కులు వంటి విషయాల్లో డెమొక్రాట్‌లు ఎదైనా ఒత్తిడి తెస్తారనిగానీ.. బహిరంగ ఖండనలకు, విమర్శలకు దిగుతారనిగానీ నేను భావించడం లేదు. చైనా విషయంలోనైనా.. ఇతర అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే విషయంలోనైనా భారత్‌కు యునైటెడ్ స్టేట్స్ ఎంత అవసరమో.. యునైటెడ్ స్టేట్స్‌కు భారత్ అవసరమూ అంతే ఉంటుంది.

ఇదీచూడండి: బైడెన్‌ హయాంలో వలస విధానాల్లో భారీ మార్పులు ?

ఇదీచూడండి: డెమొక్రాట్లదే అమెరికా ప్రతినిధుల సభ.. కానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.