ETV Bharat / international

పడ్డారండీ ప్రేమలో మరీ.. అమెరికా-బంగ్లాదేశ్ 'ప్రేమ' - బంగ్లాదేశ్​

ప్రేమంటే అనిర్వచనీయమైన అనుభూతి.. ప్రేమకు అవధుల్లేవు, కులమతాలు, దేశ సరిహద్దులు అడ్డేరావు. ఇదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసింది బంగ్లాదేశ్​-అమెరికాకు చెందిన ఓ ప్రేమజంట. ఇంతకీ వారి ప్రేమ ఎలా మొదలైందో తెలుసా..?

An Amazing Love Story From The United States Of America To Bangladesh
పార్వతి-దేవదాసును తలపించిన అమెరికా-బంగ్లాదేశ్ 'ప్రేమ'
author img

By

Published : Mar 18, 2020, 11:51 AM IST

Updated : Mar 18, 2020, 2:05 PM IST

రోమియో-జూలియెట్, పార్వతి-దేవదాసు, షాజహాన్​-ముంతాజ్​.., ప్రపంచానికి ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమ జంటలు. ఇలాంటి అమర ప్రేమికులు ఎంతో మంది గురించి వినుంటాం, చూసుంటాం కూడా. అయితే ఫేస్​బుక్​ వేదికగా ఓ బంగ్లాదేశ్​ యువకుడికి, అమెరికా యువతికి మధ్య చిగురించిన ప్రేమ.. ప్రస్తుతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాదు వీరి ప్రేమ పెళ్లిపీటలెక్కింది కూడా..! ఇంతకీ ఈ ప్రేమపక్షుల మధ్య స్నేహం ఎలా చిగురించింది? అది ఎలా ప్రేమగా మారిందంటే...

బంగ్లాదేశ్​ బారిసల్​ జిల్లా కౌనియాకు చెందిన 28 ఏళ్ల మైఖేల్​ ఏపూ మాండోల్​.., అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన సారాకున్​ (28)లు 2017 నవంబర్​ 19న పేస్​బుక్​లోని ఓ గ్రూప్​ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత స్నేహితులయ్యారు. మెల్లగా చాటింగ్​ మొదలెట్టారు. రోజులు గడిచేకొద్దీ సాధారణ మెసేజ్​ల నుంచి రొమాంటిక్​ మెసేజ్​ల దాకా వెళ్లింది వీరి స్నేహం. అదే సమయంలో ఏపూతో ప్రేమలో పడింది సారా. ఇక అప్పటినుంచి ఫోన్​కాల్స్​, వీడియో కాల్స్​తో వారి బంధం మరింత బలపడింది.

An Amazing Love Story From The United States Of America To Bangladesh
పార్వతి-దేవదాసును తలపించిన అమెరికా-బంగ్లాదేశ్ 'ప్రేమ'

మొదటిసారి కలిసింది ఎక్కడంటే

ఇలా ఏడాది పాటు సాగిన తర్వాత.. ఇద్దరూ ఒకసారి కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. మిన్నెసోటాలో ఓ వృద్ధాశ్రమంలో పని చేస్తున్న సారా.. తన ప్రియుడ్ని కలిసేందుకు అమెరికా నుంచి బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా చేరుకుంది. అక్కడే ఏపూను తొలిసారి చూసింది. యూఎస్​ నుంచి తన కోసం వచ్చిన ప్రేయసిని.. సంతోషంగా కౌనియా​కు తీసుకెళ్లి కుటుంబసభ్యులకు పరిచయం చేశాడు ఏపూ.

ఇరు సంప్రదాయాల్లో వివాహం

మైఖేల్​ కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించారు. అనంతరం ఇరువురి సంప్రదాయాల ప్రకారం తాజాగా వీరి విహహం జరిగింది. ఏపూ విదేశీ ప్రేమ విషయం తెలుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు అమెరికా వధువును చూసేందుకు కల్యాణ వేదికకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

ఇదీ చదవండి: వైరస్సే కదా అని తేలిగ్గా చూస్తే.. అధ్యక్ష ఎన్నికలు ఆపేస్తా!

Last Updated : Mar 18, 2020, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.