ETV Bharat / international

కటకటాల్లోకి సెక్స్​ గురు- 120 ఏళ్ల జైలు - న్యూూయార్క్​ కోర్టు

ఆశ్రమం పేరుతో మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్న ఓ వ్యక్తికి 120 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యూయార్క్​ కోర్టు. స్వయం సహాయక కోర్సు పేరుతో అతడు ఈ దురాగతాలకు పాల్పడేవాడు. ఉద్వేగభరిత ఉపన్యాసాలతో భక్తురాళ్లను శృంగార బానిసలుగా మార్చేవాడు.

amreica new york court has announced verdict of 120 years of imprisonment to a person
అమెరికాలో ఆ కామాంధుడికి 120 ఏళ్ల జైలు శిక్ష
author img

By

Published : Oct 29, 2020, 5:47 AM IST

Updated : Oct 29, 2020, 11:48 AM IST

మహిళలను శృంగార బానిసలుగా చేసి వారిపై అత్యాచారాలు జరుపుతూ ఆశ్రమం లాంటి సంస్థ నడుపుతున్న కీత్ రనీర్(60)కు అమెరికాలోని న్యూయార్క్ కోర్టు 120 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. గంభీరమైన ఉపన్యాసాలతో సంపన్నులు, ప్రముఖులైన భక్తురాళ్లను ఆకట్టుకొని కీత్ ఈ దురాగతాలకు పాల్పడేవాడు.

'గ్రాండ్​ మాస్టర్'​లా...

ఇతని ఆశ్రమానికి వచ్చే భక్తులు అయిదు రోజుల స్వయం సహాయక (సెల్ఫ్ హెల్ప్) కోర్సుల కోసం అయిదు వేల డాలర్ల ఒప్పందంపై సంతకాలు చేసేవారు. ఈ కోర్సుల మాటున మహిళల లైంగిక దోపిడీకి కీత్ పథక రచన చేసేవాడు. శిక్షణలో భాగంగా డాస్ పేరిట పిరమిడ్ ఆకృతి రూపొందించేవాడు అందులో మహిళలు బానిసలుగా చుట్టూ చేరగా.. 'గ్రాండ్ మాస్టర్' హోదాలో కీత్ అగ్రభాగాన కూర్చొనేవాడు.

ఆయా మహిళల వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సేకరించేవాడు. 20 మంది మహిళలతో(ఇందులో ఒకరికి పదిహేనేళ్లు) ఇటువంటి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుండగా 2018 లో మెక్సికోలో కీత్ రనీర్​ను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:మాస్క్​ వేసుకోమన్న గార్డుకు 27 కత్తిపోట్లు

Last Updated : Oct 29, 2020, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.