ETV Bharat / international

'క్యాపిటల్‌' వద్ద ఉద్రిక్తత- భారీగా బలగాల మోహరింపు - capitol protests

అమెరికాలోని క్యాపిటల్​ భవనంపై దాడికి పాల్పడినవారికి మద్దతుగా శనివారం అదే ప్రాంతంలో భారీ ర్యాలీ(capitol protests) చేపట్టారు డొనాల్డ్ ట్రంప్​ మద్దతుదారులు. ఈ నేపథ్యంలో పార్లమెంటు భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Pro Trump rally US Capitol
క్యాపిటల్
author img

By

Published : Sep 19, 2021, 5:26 AM IST

Updated : Sep 19, 2021, 7:38 AM IST

అమెరికా క్యాపిటల్​ భవనం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్​ భవనం ఎదుట ప్రదర్శనలు(capitol protests) చేపట్టటం వల్ల.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. పార్లమెంటు భవన పరిసరాల్లో ఫెన్సింగ్‌, బారికేడ్లతో పాటు వాహనాలను అడ్డుగా ఉంచారు.

అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ.. ఈ ఏడాది జనవరి 6న ట్రంప్‌ మద్దతుదారులు పార్లమెంటులోకి చొచ్చుకెళ్లి, దాడులకు పాల్పడ్డారు(capitol protests). ఇందుకు బాధ్యులను చేస్తూ ఇప్పటివరకూ 68 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జైళ్లలో ఉన్న వీరందరికీ మద్దతుగా ట్రంప్‌ తరపు ప్రచారకర్త మట్‌ బ్రేనర్డ్‌ శనివారం ర్యాలీకి పిలుపునిచ్చారు. నిరసన తెలిపేందుకు 700 మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా, అంతకంటే ఎక్కువమంది చేరుకోవడం భద్రత పరమైన ఆందోళనకు దారితీసింది.

ఆందోళనకారులు ఎలాంటి ఆయుధాలు తీసుకురాకూడదని పోలీసులు ముందే షరతు విధించారు. కానీ.. ప్రొడ్‌ బాయ్స్‌, ఓత్‌ కీపర్స్‌ వంటి గ్రూపులకు చెందిన అతివాదులు ర్యాలీలో పాల్గొనవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో నేషనల్‌ గార్డ్‌ కొలంబియా డిస్ట్రిక్ట్‌ పోలీసుల సహకారంతో క్యాపిటల్​వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదీ చూడండి: నిఘా వైఫల్యంతోనే బీభత్సం: సెనేట్ నివేదిక

Last Updated : Sep 19, 2021, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.