ETV Bharat / international

వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా- తేల్చిన మరో నివేదిక! - వుహాన్ ల్యాబ్ లీక్

కొవిడ్-19 వైరస్‌ చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టినట్లు రుజువైందని అమెరికాలోని రిపబ్లికన్లు ఆరోపించారు. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేశారు. చైనాలోని వూహన్ ల్యాబ్ నుంచే వైరస్‌ బయటకు వచ్చిందనేందుకు అనేక రుజువులు ఉన్నాయని తెలిపారు. దీనిపై అమెరికా నిఘా సంస్థలు మాత్రం ఇంకా ఓ తుది అభిప్రాయానికి రాలేదు.

covid lab leak
కరోనా ల్యాబ్ లీకేజీ
author img

By

Published : Aug 3, 2021, 3:28 PM IST

కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే ఆవిర్భవించిందనే అనుమానాలకు బలం చేకూరేలా మరో నివేదిక బయటకు వచ్చింది. చైనా పరిశోధన కేంద్రం నుంచే మహమ్మారి పుట్టినట్లు అమెరికాలోని రిపబ్లికన్ ప్రతినిధి మైక్‌ మెక్‌కాల్ ఆరోపించారు. వుహాన్‌ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ మానవులకు సోకేలా జన్యుపరమైన మార్పులు చేశారని, ఆ సంగతి దాచిపెట్టారని ఆరోపించారు. ఇందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయన్నారు. వుహాన్ ల్యాబ్‌ వద్ద పటిష్ఠమైన భద్రతా చర్యలు లేవన్నారు. ప్రమాదకర వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసే వ‌్యవస్థ కూడా సరిగా లేదని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మంది మరణించారంటూ మెక్‌కాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

'జంతువుల నుంచి కాదు..'

వైరస్‌ సీ ఫుడ్ మార్కెట్‌ ద్వారా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందనే ఓ వాదనను కూడా రిపబ్లికన్లు విడుదల చేసిన నివేదిక ఖండించింది. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ లీకైందని అది కూడా 2019 సెప్టెంబర్‌ 12కు ముందే ఇది జరిగిందని పేర్కొంది.

కరోనా వైరస్‌ పుట్టుకపై దర్యాప్తు ముమ్మరం చేసి 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఇప్పటికే అమెరికా నిఘా సంస్థలకు అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకిందా లేదా వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకైందా అనే దానిపై అమెరికా నిఘా సంస్థలు ఇంకా ఓ తుది అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్లు బయటపెట్టిన ఈ నివేదిక ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇన్ని ఆరోపణలు వస్తున్నా వుహాన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ మాత్రం.... రా డేటా, సేఫ్టీ లాగ్స్, గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను మాత్రం ఎవరితో పంచుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.