5-11 ఏళ్ల వయస్సు పిల్లలకు కొవిడ్ టీకా పంపిణీ చేయాలని అమెరికా భావిస్తున్న తరుణంలో.. ఆ దేశ ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ)(America Fda) కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికాలో ఎక్కువగా ఉపయోగిస్తున్న కొవిడ్ టీకా ఫైజర్(Pfizer Vaccine For Kids)... పిల్లలపై సమర్థంగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫైజర్(Pfizer Vaccine For Kids) అందించిన డేటాను పరిశీలించిన అనంతరం ఎఫ్‌డీఏ ఈ ప్రకటన చేసింది. పిల్లల్లో వ్యాధి సోకకుండా ఫైజర్ టీకా సమర్థంగా పనిచేస్తోందని ఇప్పటికే ట్రయల్స్‌లో తేలింది.
టీకాతో మంచే ఎక్కువ!
అమెరికాలో 5-11ఏళ్ల వయస్సు గల పిల్లలు సుమారు 28మిలియన్ల మంది ఉన్నారు. వారికి ఇచ్చేందుకు టీకాలు సిద్ధమేనా? అన్న అంశంపై వచ్చే వారంలో ఎఫ్‌డీఏ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరగనుంది. ఈ తరుణంలో ఫైజర్(Pfizer Vaccine For Kids) ఇచ్చిన డేటాను విశ్లేషించి, ఆ వివరాలను ఎఫ్‌డీఏ(America Fda) తాజాగా విడుదల చేసింది. చిన్నారులకు టీకా ద్వారా కలిగే దుష్ప్రభావాలకన్నా.. మంచే ఎక్కువగా జరుగుతుందని ఎఫ్‌డీఏ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. కొవిడ్ సోకిన చిన్నారులు టీకా తీసుకుంటే చాలా సందర్భాల్లో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి రాదని, మరణం నుంచి కూడా రక్షణ లభిస్తుంది అభిప్రాయపడ్డారు.
మంగళవారమే చర్చ..
5-11 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఎఫ్‌డీఏ(America Fda) ఇంకా అనుమతులు ఇవ్వలేదు. మంగళవారం జరగనున్న సమావేశంలో స్వతంత్ర సలహాదారులతో కూడిన ప్యానెల్ ఈ వ్యవహారంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత ఎఫ్‌డీఏ తుది నిర్ణయానికొస్తుంది. ఒకవేళ ఎఫ్‌డీఏ అనుమతులిస్తే.. అమెరికాలో నవంబర్ తొలివారం నుంచి చిన్నారులకు టీకా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 12 అంతకుమించిన వయస్సు వారికి ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. రెండు డోసుల టీకాతో పిల్లలకు 91శాతం సామర్థ్యం లభిస్తుందని, వారిలో లక్షణాలున్నా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఫైజర్ ఓ డేటాను విడుదల చేసింది.
ఇదీ చూడండి: రష్యాలో కరోనా కల్లోలం- 'డెల్టా'ను మించి..
ఇదీ చూడండి: ఆ ఆకుల కోసం ఎగబడ్డ జనం.. ఎందుకంటే?