ETV Bharat / international

అంతరిక్షం నుంచి ఓటు.. ఎలా వేశారంటే! - iss

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఈ ఎన్నికల్లో పలువురు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయగా.. మరికొంతమంది మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌ పద్ధతిని ఎంచుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అంతరిక్షం నుంచి కూడా ఓటు వేయొచ్చనే విషయం మీకు తెలుసా?. అవును.. పెరిగిన సాంకేతికత నేపథ్యంలో అంతరిక్షం నుంచి కూడా ఓటు వేసేందుకు ఇక్కడి చట్టాలు అనుమతిస్తున్నాయి.

america allows absentee voting from outer space
అంతరిక్షం నుంచి ఓటు.. ఎలా వేశారంటే!
author img

By

Published : Nov 7, 2020, 7:10 AM IST

నాసా వ్యోమగామి కేట్‌ రూబిన్స్‌ తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) పోలింగ్‌ బూత్‌ నుంచి ఉపయోగించుకున్నారు. భార రహిత స్థితిలో ఆమె ఓటు వేయడం ఇది రెండోసారి కావడం విశేషం. 2016లో ఆమె ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాగే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అంతరిక్ష కేంద్రం నుంచి అమెరికన్‌ వ్యోమగాములు ఓటు వేసేందుకు వీలుగా 1990లో టెక్సాస్‌ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. 1997 నుంచి అమెరికా వ్యోమగాములు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నాసా వ్యోమగామి డేవిడ్‌ ఓల్ఫ్‌ 1997లో మిర్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి ఓటు వేసి.. అంతరిక్షం నుంచి ఓటు వేసిన తొలి అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. అయితే ఓటు వేసేందుకు ముందుగానే వారు రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో నాసా తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది.

  • మిలటరీ సభ్యులు ఉపయోగించుకునే ఫెడరల్‌ ఫోస్ట్‌ కార్డు అప్లికేషన్‌(ఎఫ్‌పీఎస్‌ఏ) ప్రక్రియ ద్వారానే ఇది కూడా ప్రారంభమవుతుంది.
  • ఐఎస్‌ఎస్‌కు వెళ్లే ముందు లాంచ్‌ సమయంలోనే ఈ దరఖాస్తును పూర్తి చేసి ఓటు వేసేందుకు తమ సంసిద్ధతను తెలపాల్సి ఉంటుంది.
  • వ్యోమగామి హోమ్‌ కౌంటీ నుంచి కౌంటీ క్లర్క్‌ టెస్టు బ్యాలెట్‌ను హ్యూస్టన్‌లోని నాసాకు చెందిన జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కి పంపిస్తారు.
  • స్పేస్‌ స్టేషన్‌ కంప్యూటర్‌ను ఉపయోగించి వారు టెస్టు బ్యాలెట్‌ను పూర్తి చేసి తిరిగి కౌంటీ క్లర్క్‌కి పంపించగలరా అని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు.
  • ఇది విజయవంతమైతే సురక్షితమైన ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌ను జాన్సన్‌ మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌నుంచి అప్‌లింక్‌ చేస్తారు.
  • నిర్ధిష్ట ఆధారాలతో కూడిన ఈ-మెయిల్‌ కౌంటీ క్లర్క్‌ నుంచి వ్యోమగామికి చేరుతుంది. ఇందులోని వివరాలు ఆ బ్యాలెట్‌ను తెరిచేందుకు ఉపయోగపడతాయి.
  • అనంతరం వ్యోమగామి తన ఓటు హక్కును సురక్షితమైన పద్ధతిలో వినియోగించుకుని ఆ బ్యాలెట్‌ను కౌంటీ క్లర్క్‌ కార్యాలయానికి డౌన్‌లింక్‌ చేస్తారు. దీంతో ఓటింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇదీ చూడండి: 'చిల్​ డొనాల్డ్' అంటూ ట్రంప్​కు గ్రెటా 'రివర్స్​ పంచ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.