ETV Bharat / international

నిషేధాలు, ఆంక్షల నడుమ.. న్యూఇయర్ - కొత్త సంవత్సర శుభాకాంక్షలు

న్యూఇయర్ వేడుకలపై కరోనా ఆంక్షలు అలుముకున్నాయి. వేడుకల స్వరూపాలే మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర సంబరాలు.. డిజిటల్ వేదికలకే పరిమితం కానున్నాయి. పలు దేశాలు ఇప్పటికే లాక్​డౌన్ బాట పట్టగా... భారత్​లోని చాలా రాష్ట్రాలు వేడుకలను దూరం పెట్టాయి. ప్రజలు కూడా ఇళ్లలోనే ఉండి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు మొగ్గు చూపుతున్నారు.

After a year like this, expect a strange New Year's Eve
నిషేధాలు, ఆంక్షల నడుమ.. న్యూఇయర్
author img

By

Published : Dec 31, 2020, 8:40 AM IST

కొత్త ఉత్సాహానికి స్వాగతం పలుకుతూ... ఏటా ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. కానీ ఈ దఫా కరోనా వైరస్‌ చేదు జ్ఞాపకాల్ని మిగిల్చనుంది.. బాణాసంచా వెలుగులు, కనువిందు చేసే ప్రదర్శనలతో హోరెత్తిపోయే సంబరాలు.. అంధకారాన్ని అలుముకోనున్నాయి. అర్ధరాత్రి వేళ వినిపించే ఔత్సాహికుల కేరింతలు, వాహనాల రణగొణ ధ్వనులు మూగబోనున్నాయి.

2020లో విస్తృతంగా ప్రబలిన మహమ్మారి. ఈ వేడుకల స్వరూపాన్నే మార్చివేసింది. ప్రపంచ దేశాల్లో అధికారులు నిషేధాజ్ఞలు విధించేలా చేసింది. న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌ నుంచి సిడ్నీ హార్బర్‌ దాకా టీవీషోలు, డిజిటల్‌ కార్యక్రమాలకు.. వేడుకలు పరిమితమవగా.. లాస్‌ వెగాస్‌ స్ట్రిప్ నుంచి పారిస్‌లోని ఆర్క్‌ డి ట్రియంఫె వరకు టపాసులతో చేసే అద్భుత ప్రదర్శనలు రద్దయ్యాయి.

టర్కీలో నాలుగు రోజులు లాక్‌డౌన్‌

టర్కీ నాలుగు రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించింది. డిసెంబరు 31 రాత్రి నుంచి జనవరి 1, ఉదయం 8 గంటల వరకు స్థానికులు బయటికి రావొద్దని పోలండ్‌ తెలిపింది. 2020 ముగింపు వేడుకలకు అమెరికాలోని నాష్‌విల్లే, టెన్నెస్సీలు స్వస్తి పలికాయి. జర్మనీలో బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించడంతో.. ఏటా టపాసుల వెలుగుల్లో జనంతో కిటకిటలాడే ఆ దేశ వీధులు బోసిపోనున్నాయి.

కొత్త సంవత్సరం కౌంట్‌డౌన్‌ను లెక్కించే వేదికను... ఆమ్‌స్టర్‌డ్యాం పార్కు నుంచి. పుట్‌బాల్‌ మైదానంలోకి నెదర్లాండ్స్‌ మార్చింది. కానీ వీక్షకులను అనుమతించడానికి నిరాకరించింది.

భారత్‌లోనూ...

దేశంలోని చాలా రాష్ట్రాలు నూతన సంవత్సర ప్రారంభ వేడుకలను దూరం పెట్టాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. మరోవైపు, దేశ రాజధాని దిల్లీ, పరిసర ప్రాంతాల్లోని పబ్‌లు, రెస్టారెంట్లు వేడుకలకు ముస్తాబవుతున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఆఫర్లు, రాయితీలను ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రజలు ఇళ్లలోనే ఉండి వేడుకలు జరుపుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.

ఇదీ చదవండి: కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.