ETV Bharat / international

పాక్​పై ట్రంప్​ మెతక వైఖరికి కారణం అదేనా? - ట్రంప్​ తాజా వార్తలు

తొలిసారి భారత్​లో పర్యటన.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ స్టేడియం వేదిక.. కిక్కిరిసిన జనసంద్రాన్ని ఉద్దేశించి అధ్యక్షుడి ప్రసంగం.. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే పాక్​ గురించి ప్రస్తావించినప్పుడు మాత్రం ట్రంప్ కాస్త మెతక వైఖరి ప్రదర్శించారు? దానికి కారణమేంటి?

Trump Goes Soft On Pak In Motera
పాక్​పై ట్రంప్​ మెతక వైఖరికి కారణం అదేనా?
author img

By

Published : Feb 26, 2020, 6:52 AM IST

Updated : Mar 2, 2020, 2:40 PM IST

"నేను అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి మా అధికార యంత్రాంగం పాకిస్థాన్​తో చర్చలు జరుపుతోంది. ఈ చర్యల వల్ల పాకిస్థాన్​లో సానుకూల స్పందనలు కనపడుతున్నాయి." ఇవి సోమవారం 'నమస్తే ట్రంప్'​ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు అన్న మాటలు. మంగళవారమూ అదే పరిస్థితి. ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చల తర్వాత కూడా ఇదే తరహాలో మాట్లాడారు ట్రంప్.

'కర్ర విరగ కూడదు... పాము చావకూడదు' అన్నట్లు తీవ్రవాదంపై పోరు గురించి ప్రస్తావిస్తూ పాక్​పై మాత్రం మెతక వైఖరి ప్రదర్శించారు ట్రంప్​. అధ్యక్షుడు ఇలా మాట్లాడటం వెనుక కారణమేంటి? ఇది తెలియాలంటే కాస్త వెనక్కి వెళ్లాలి.

2019 జనవరి...

"అది ఎంతో తెలుసా? మేము ఆ డబ్బును ఐదు గంటల్లో ఖర్చు చేస్తాం. గ్రంథాలయమట! అఫ్గానిస్థాన్​లో లైబ్రరీ ఎవరు వినియోగిస్తారో నాకైతే తెలియదు." ఇవి అఫ్గానిస్థాన్​కు భారత్​ చేసిన సాయాన్ని ఉద్దేశిస్తూ 2019 జనవరిలో అమెరికా అధ్యక్షుడు వ్యంగ్యంగా అన్న మాటలు.

అఫ్గాన్‌ అభివృద్ధిలో భాగంగా అక్కడి యువత కోసం భారత్‌ గ్రంథాలయం ఏర్పాటు చేసింది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ట్రంప్​ భారత్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యలపై భారత్​ అసహనం వ్యక్తం చేసింది. 3 బిలియన్​ డాలర్ల సాయంతో అఫ్గానిస్థాన్​ పునర్నిర్మాణానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

ఇందుకోసమే అలా...

అయితే తాజాగా నమస్తే ట్రంప్​ కార్యక్రమంలో పాకిస్థాన్​పై డొనాల్డ్ మెతక వైఖరికి కారణం యూఎస్​-తాలిబన్ల శాంతి ఒప్పందం సాధించేందుకే. ఎందుకంటే ఇందులో పాకిస్థాన్​ సాయం ట్రంప్​కు తప్పనిసరి.

"అఫ్గానిస్థాన్​లో ట్రంప్​కు ఒప్పందం కావాలి. ఇది ఆయన మరోసారి గెలిచేందుకు సాయపడే కీలక అంశం. 2020 నవంబర్​లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలోపు అఫ్గాన్​లో ఉన్న అగ్రరాజ్య దళాలను వెనక్కి రప్పించడం ఆయనకు ముఖ్యం. ఇది ఆయన ఇచ్చిన ప్రధాన వాగ్దానాలలో ఒకటి."

-ఆనంద్​ ఆర్నీ, 'రా ' మాజీ ప్రత్యేక కార్యదర్శి, నిఘా వ్యవహారాల విశ్లేషకుడు

ఇందుకోసమే పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ను పలు సందర్భాల్లో తన స్నేహితుడిగా ట్రంప్​ ప్రస్తావించడం గమనార్హం.

"అమెరికా-పాకిస్థాన్​ మధ్య బంధం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంది. యూఎస్​-తాలిబన్ల శాంతి ఒప్పందంలో సాయం చేయాలని పాక్​ను అమెరికా ఎప్పటినుంచో కోరుతోంది. ఈ ఒప్పందం కొలిక్కి రావడానికి పాక్​ పాత్ర కీలకంగానే ఉంది. కనుక గుజరాత్​ సభలో పాకిస్థాన్​ గురించి ట్రంప్ మెత్తగా మాట్లాడంలో ఆశ్చర్యమేమీ లేదు."

- శరత్​ శభర్​లాల్, పాక్​లో భారత మాజీ హైకమిషనర్​

తీవ్రవాద సంస్థలపై పాక్​ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా చెప్పినా.. ఇస్లామాబాద్​తో అవసరం ఉంది కనుక అంత కఠినంగా ఉండే పరిస్థితి లేదు.

భారత్​ ఆందోళన...

అయితే శాంతి ఒప్పందంలో పాక్​ పాత్రపై భారత్​ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకసారి అమెరికా దళాలు అక్కడ నుంచి వెళితే భారత్​ లక్ష్యంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు తమ స్థావరాలను అఫ్గాన్​ సరిహద్దులకు మార్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి కశ్మీర్​కు ఉగ్రావాదులను పంపే ప్రమాదమూ లేకపోలేదు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి భారత్​ తెలియజేసింది.

అయితే మరోసారి కశ్మీర్​ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమని ట్రంప్​ పేర్కొనకుండా భారత్​ చూసుకోవాలి. కశ్మీర్​ ద్వైపాక్షిక సమస్య కాదని కేవలం భారత అంతర్గత విషయమని ట్రంప్​కు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది.

(రచయిత-స్మితా శర్మ)

Last Updated : Mar 2, 2020, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.