ETV Bharat / international

పాస్‌వర్డ్‌ మర్చిపోయే.. రూ.1,800 కోట్లు గల్లంతాయే..! - క్రిప్టో కరెన్సీతో ఇబ్బందులు

సాంకేతికత కొత్త పుంతలు తొక్కతుండడం వల్ల డిజిటల్ జీవితానికి అలవాటు పడ్డాం. దీంతో ఫోన్​ నుంచి మొదలుకుని అన్నింటికీ పాస్​వర్డ్​ ఉంటుంది. ఇలా ఉన్న పాస్​వర్డ్​ని మరిచిపోయి ఓ వ్యక్తి 1,800 కోట్లు రూపాయిలు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. మరుపు మానవ సహజం. కానీ దాని విలువ కోట్లలో అంటే ఆశ్చరంగా ఉంది కాదా?

About Rs 1800 crore is lost due to a person forgetting a password
పాస్‌వర్డ్‌ మర్చిపోవడంతో రూ.1,800 కోట్లు గల్లంతు!
author img

By

Published : Jan 14, 2021, 7:22 AM IST

ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతాల పాస్‌వర్డ్‌లను మరిచిపోవడం అందరికీ ఎదురయ్యే సమస్యే. అయితే దీనివల్ల ఓ వ్యక్తికి ఏకంగా రూ.1,800 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది! జర్మనీకి చెందిన స్టీఫెన్‌ థామస్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2011లో 7,002 బిట్‌ కాయిన్ల(ఓ రకమైన డిజిటల్‌ కరెన్సీ)ని కొనుగోలు చేశారు. ఇప్పుడు దాని విలువ రూ.1,800 కోట్లకు పైగా(245 మిలియన్‌ డాలర్లు) పెరిగింది. థామస్‌ ఆ కాయిన్లను ఐరన్‌కీ అనే ఎన్‌క్రిప్టెడ్‌ హార్డ్‌ డ్రైవ్‌లో పాస్‌వర్డ్‌తో భద్రపరుచుకున్నారు.

పొరపాటున 10 సార్లు పాస్‌వర్డ్‌ తప్పుగా నమోదు చేస్తే ఆ హార్డ్‌ డ్రైవ్‌లో ఉన్న మొత్తం డేటా మాయమవుతుంది. అంటే బిట్‌కాయిన్లన్నీ గల్లంతవుతాయి. అయితే థామస్‌ తన పాస్‌వర్డ్‌ను మరచిపోవడంతో సమస్య మొదలైంది. ఇప్పటికే 8 సార్లు పాస్‌వర్డ్‌ను తప్పుగా నమోదు చేశారు. ఇంక రెండు ప్రయత్నాలే మిగిలాయి. వాటిలోనూ విఫలమైతే ఇక ఆయన ఖాతాలో చిల్లిగవ్వ మిగలదు. మిగతా బ్యాంకు ఖాతాల్లాగా పాస్‌వర్డ్‌లను మర్చిపోతే సంబంధిత సంస్థలు కొత్త పాస్‌వర్డ్‌ను ఇచ్చే సౌలభ్యం కూడా క్రిప్టో కరెన్సీలో ఉండదు. అన్నట్లు ఇప్పటివరకూ పాస్‌వర్డ్‌లు మర్చిపోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోల్పోయిన క్రిప్టో కరెన్సీ సొమ్ము రూ.9.5 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

ఇదీ చూడండి:బిట్​కాయిన్@40 వేల డాలర్లు- నెలలోపే రెండింతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.