ETV Bharat / international

హెచ్చరిక లేదని రూ.556 కోట్ల జరిమానా - fine

నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ 'మోన్​​సాంటో' సంస్థకు రూ. 556 కోట్ల జరిమానా విధించింది అమెరికా కోర్టు. కంపెనీ తయారు చేస్తోన్న వ్యవసాయ ఉత్పత్తి 'రౌండప్​'తో తన భర్తకు క్యాన్సర్​ వచ్చిందని ఓ మహిళ ఫిర్యాదుపై తీర్పునిచ్చింది న్యాయస్థానం.

నిర్లక్ష్యానికి ఖరీదు
author img

By

Published : Mar 29, 2019, 7:40 AM IST

నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ 'మోన్​సాంటో'కు అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కో కోర్టు భారీ జరిమానా విధించింది. కంపెనీకి చెందిన కలుపు నివారిణి 'రౌండప్​'తో తన భర్త​కు క్యాన్సర్​ వచ్చిందని కాలిఫోర్నియాలోని 70 ఏళ్ల మేరీ హర్డీమన్ ఫిర్యాదు చేశారు. విచారించిన న్యాయస్థానం పరిహారంగా 80 మిలియన్ డాలర్లు (రూ.556 కోట్లు) హర్డీమన్​కు చెల్లించాలని తీర్పునిచ్చింది.

రౌండప్​ తయారీలో లోపముందని హర్డీమన్​ ఆరోపించారు. ఉత్పత్తిపై సరైన హెచ్చరికలు లేవని తెలిపారు. మోన్​సాంటో సంస్థ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు హర్డీమన్​. మోన్​సాంటోపై అమెరికాలో ఇలాంటి కేసులు అనేకం నమోదయ్యాయి.

న్యాయస్థానం తీర్పును హర్డీమన్ తరఫు న్యాయవాదులు ఎమీ వాగ్​స్టాఫ్, జెన్నిఫర్ మూరే ప్రకటించారు. ఈ నిర్ణయం మిగతా కేసులకు ఓ దారి చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఈ తీర్పుతో కంపెనీలకు న్యాయస్థానం గట్టి హెచ్చరికలు చేసింది. పూర్తిగా పరీక్షించని ఉత్పత్తుల అమ్మకాలు సాగవని తేల్చి చెప్పింది. ఉత్పత్తులపై గమనికలూ అనివార్యమని కోర్టు ప్రకటించింది. రౌండప్​పై గెలిచిన రెండో కేసు ఇది. మోన్​సాంటో, బేయర్​ కంపెనీలు తమ వ్యాపార ధోరణులు మార్చుకోవాలి."
-జెన్నిఫర్ మూరే, హర్డీమన్​ తరఫు న్యాయవాది

గతేడాది ఆగస్టులో మోన్​సాంటోకు 289 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది అమెరికా కోర్టు. సంస్థ అప్పీలుపై 78 మిలియన్​ డాలర్లకు తగ్గించింది న్యాయస్థానం.

రౌండప్​పై వస్తోన్న ఆరోపణలను సంస్థ ఖండించింది. కలుపు నివారిణిలో వాడే గ్లిఫోసైట్​ ప్రమాదకారి కాదంటూ అనేక నివేదికలు చెబుతున్నాయని వాదించింది.

ఇదీ చూడండి:గూగుల్​ సాయం అమెరికాకే... చైనాకు కాదు : ట్రంప్

Kathmandu (Nepal), Mar 28 (ANI): Foreign Secretary Vijay Gokhale arrived in Nepal's capital for two-day visit on March 27. He held bilateral talks with his Nepalese counterpart Shanker Das Bairagi in Kathmandu on Thursday. The two Foreign Secretaries discussed the bilateral ties between both the countries. During the visit, the foreign secretary met with Nepal Prime Minister KP Sharma Oli. The foreign secretary is in the Himalayan nation to review the progress made in the ongoing India-aided projects in Nepal. Gokhale's visit to Nepal comes a day before the Nepal Investment Summit 2019. In the wake of last month's terror attack in Pulwama, the two sides also discussed ways to combat menace of terrorism.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.