ETV Bharat / international

ట్రంప్​ ఆఫీస్​లో ఆ రోజు హైడ్రామా- కీలక విషయాలు లీక్! - us troops to control protests

అమెరికాలో నిరసనలు తీవ్రరూపం దాల్చిన తర్వాత శ్వేతసౌధంలో నాటకీయ పరిణామాలు జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బలగాలను రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ చెప్పగానే అధికారులకు ఏం చేయాలో తోచలేదు. ఆయన నిర్ణయంతో రక్షణ మంత్రి విభేదించారని వార్తలు వచ్చాయి. జూన్ 1న శ్వేతసౌధంలో అసలు ఏం జరిగింది? ట్రంప్​ ఎందుకు వెనక్కి తగ్గారు?

A U-turn, a rush to see Trump, a day of tension and surprise
శ్వేతసౌధంలో ఆ రోజు ఉద్రిక్తతలు, హఠాత్పరిణామాలు
author img

By

Published : Jun 7, 2020, 3:02 PM IST

నిరసనలతో గత ఆదివారం అమెరికా అట్టుడికింది. ఆ మరునాడే తీవ్రంగా స్పందించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పౌరులపైకి సైన్యాన్ని పంపుతానని హెచ్చరించారు. కానీ ఆ నిర్ణయంపై ఎందుకు వెనక్కి తగ్గారు? అమెరికా రక్షణ మంత్రి ట్రంప్​తో విభేదించడమే ఇందుకు కారణమా? ఎస్పర్​కు, ట్రంప్​కు మధ్య వాదనలు జరిగాయా? అసలు జూన్​1న శ్వేత సౌధంలో ఏం జరిగింది..?

ఆద్యంతం నాటకీయం

అమెరికా రక్షణ మంత్రి మార్క్​ ఎస్పర్​ వాషింగ్టన్​లోని ఎఫ్​బీఐ కార్యాలయానికి మూడు బ్లాకుల దూరంలో ఉన్నారు. సెక్యూరిటీ కమాండ్​ సెంటర్​లో సమావేశం నిర్వహించే పనిలో ఉన్నారు. కానీ అప్పుడు వచ్చిన ఫోన్​ కాల్​తో ప్రణాళిక మొత్తం మారింది. వాషింగ్టన్​లో చెలరేగుతున్న నిరసనలను అదుపు చేసేందుకు ఎలాంటి భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నారని ఎస్పర్​ను, జనరల్​ మార్క్​ మిల్లేను ప్రశ్నించారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. నల్లజాతీయుడు జార్జ్​ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా వాషింగ్టన్​ నిరసనలతో అట్టుడికి, హింసాత్మక ఘటనలు చెలరేగిన తర్వాతి రోజు పరిణామాలివి.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోబోతున్నారోనని రక్షణ శాఖ అధికారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సాధారణ విధానాలు అనుసరిస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందని ట్రంప్​కు సూచించారు. అయితే ట్రంప్​, ఆయన సీనియర్​ సహాయకుల ఆలోచన మాత్రం మరోలా ఉంది. అమెరికా వీధుల్లో వీలైనంత త్వరగా బలగాలను మోహరించాలని వారు చెప్పినట్లు శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

మే 31 ఆదివారం రోజు వాషింగ్టన్​లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు. సెయింట్​ జాన్స్ చర్చికి నిప్పు పెట్టారు. ఈ విషయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ట్రంప్.. తిరుగుబాటు చట్టాన్ని అమలు చేసైనా సైన్య బలగాలను రంగంలోకి దించాలని భావించినట్లు అధికారి పేర్కొన్నారు. ఆందోళనలను అణచివేసేందుకు 10 వేల బలగాలను వీధుల్లో మోహరించాలని ట్రంప్​ అనుకున్నట్లు చెప్పారు.

ట్రంప్​తో వాదన..

అయితే ట్రంప్ నిర్ణయంతో ఎస్పర్​, మిల్లే విభేదించారు. పౌరులపైకి సైన్యాన్ని పంపడం సరికాదన్నారు. పోలీసులతో నిరసనలను అదుపు చేయవచ్చని.. సైన్యాన్ని మోహరించాల్సిన అవసరం లేదని వాదించారు. అయినప్పటికీ వీలైనన్ని బలగాలను రంగంలోకి దింపాలని ట్రంప్ కోరినట్లు శ్వేతసౌధ అధికారి చెప్పారు. ఆందోళనలను అణచివేసేందుకు అప్పుడున్న భద్రత సరిపోదన్నారు ట్రంప్​.

ట్రంప్​ డిమాండ్​ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించారు ఎస్పర్​, మిల్లే. పరిస్థితిని అదుపు చేసేందుకు సైన్యానికి బదులుగా అన్ని రాష్ట్రాలు నేషనల్​ గార్డు బలగాలను వినియోగించుకునేలా త్వరితగతిన చర్యలు చేపట్టారు.

జూన్​ 1న శ్వేతసౌధంలో సమావేశాల అనంతరం ట్రంప్ ఊహించని రీతిలో రోస్ గార్డెన్​కు వెళ్లారు. ఆందోళనలను సహించబోమని.. శాంతి భద్రతలు తన చేతిలో ఉన్నాయని ప్రకటించారు. ఇటీవలి కాలంలో దేశంలో అరాచకవాదులు, అల్లరి మూకలు , కాల్పులు జరిపేవారు, దోపిడీదారులు, నేరస్థులు ఎక్కువైపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు ప్రజలకు రక్షణ కల్పించలేకపోతే సైన్యాన్ని రంగంలోకి దింపుతానని హెచ్చరించారు.
ఆ తర్వాత కాసేపటికే అధికారులతో కలసి బైబిల్ చేతపట్టుకుని లఫాయెటి పార్క్​ నుంచి నడుచుకుంటూ సెయింట్ జాన్స్ చర్చి వద్దకు వెళ్లారు ట్రంప్​. ఆయనతో పాటు ఎస్పర్​, మిల్లే ఉండటం చూసి విమర్శకులు నిందించారు. సైన్యాన్ని రంగంలోకి దింపేందుకు ట్రంప్​తో వారు జతకట్టారని మండిపడ్డారు. కానీ... తెర వెనుక జరిగింది మాత్రం పూర్తిగా భిన్నమని తెలిపారు శ్వేతసౌధం సీనియర్ అధికారి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.