లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఐదోవంతు మంది దీర్ఘకాల కరోనాతో బాధపడుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అమెరికాకు చెందిన ఫెయిర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపనీ ఒక పరిశోధన నిర్వహించింది. ఇందులో గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది వరకు నమోదైన కరోనా కేసులను విశ్లేషించారు. లక్షణాలు లేని కరోనా బాధితుల్లో 19 శాతం మందిలో దీర్ఘకాల కరోనాను గుర్తించినట్లు వారు తెలిపారు.
అసలేంటీ దీర్ఘకాల కరోనా..
కరోనా నిర్ధరణ అయిన నాలుగువారాల తర్వాత కూడా లక్షణాలు తగ్గకపోవడాన్ని దీర్ఘకాల కరోనా అంటారు. దీనిలో ప్రధానంగా ఒంటి నొప్పులు, శ్వాస సంబంధ సమస్యలు, అధిక కొవ్వు, అధిక రక్తపోటు ఉన్నాయి. వైరస్‌ను ప్రారంభంలోనే గుర్తించినా ఆస్పత్రిలో చేరకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పరిశోధకులు తెలిపారు. దీర్ఘకాల కొవిడ్‌ను గుర్తించిన బాధితుల్లో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారని వారు తెలిపారు. ఈ సమస్యతో ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు వారు వెల్లడించారు. "వైరస్‌తో తీవ్రంగా పోరాడిన తర్వాత రోగనిరోధక శక్తిలో అనేక మార్పులొస్తాయి. దీంతో శరీరం తిరిగి మునుపటిలా మారేందుకు కొంత సమయం పడుతోంది. మరోవైపు వైరస్ తక్కువ స్థాయిలో శరీరంలో ఉంటూనే ఉంది" అని పరిశోధకులు వెల్లడించారు.
ఇవీ చూడండి: