తనపై అభిశంసన తీర్మానంలో బహిరంగ విచారణ సరిగా జరగడం లేదని అభిప్రాయపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చరిత్రలో ఎప్పుడూ చూడని ద్వంద్వ నీతిని బహిరంగ విచారణలో పాటిస్తున్నారని పేర్కొంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బహిరంగ విచారణకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో తన మొదటి ఫోన్‌కాల్ సంభాషణ రాతప్రతిని విడుదల చేశారు ట్రంప్.
-
....A double standard like never seen before in the history of our Country?
— Donald J. Trump (@realDonaldTrump) November 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">....A double standard like never seen before in the history of our Country?
— Donald J. Trump (@realDonaldTrump) November 15, 2019....A double standard like never seen before in the history of our Country?
— Donald J. Trump (@realDonaldTrump) November 15, 2019
విచారణ సందర్భంగా ఉక్రెయిన్‌లో మాజీ అమెరికా రాయబారి మార్రీ యవనోవిచ్పై ప్రశ్నల వర్షం కురింపించింది కాంగ్రెస్. సమాధానంగా ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ చరవాణి సంభాషణపై పలు అంశాలను యవనోవిచ్ బయటపెట్టారు.
'ప్రమాదమనే తప్పించారు'
తనను అకస్మాత్తుగా రాయబారి పదవి నుంచి తొలగించారని.. వెల్లడించారు యవనోవిచ్. ఉక్రెయిన్ అధ్యక్షుడితో చరవాణి సంభాషణపై ట్రంప్ తనపై ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో వివరించారు. ప్రమాదమని పరిగణించడం వల్లే.. తనను పదవి నుంచి తప్పించారని అభిప్రాయపడ్డారు. రాయబారిగా తన పనితీరుపై ట్రంప్ ట్విట్టర్ పోస్టులు భయపెట్టేవని వ్యాఖ్యానించారు యవనోవిచ్.
'ఆమె వైఖరి సరైంది కాదు'
రాయబారిగా పనిచేసిన దేశాలన్నింటిలోనూ యవనోవిచ్ పనితీరు సరిగా లేదని వ్యాఖ్యానించారు ట్రంప్. ఆమె సోమాలియాలో పనిచేస్తున్నప్పుడు ఏవిధమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో అందరికీ తెలుసన్నారు. అనంతరం ఆమె ఉక్రెయిన్‌కు వెళ్లిందని, తన రెండో సంభాషణలో ఆ దేశ అధ్యక్షుడు.. యవనోవిచ్ తీరుపై వ్యతిరేకంగా మాట్లాడినట్లు వెల్లడించారు.
యవనోవిచ్ ఏ తప్పూ చేయకపోయినా ఉక్రెయిన్ రాయబారి బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు అధికారులు ఆమెకు సమాచారమిచ్చారని కాంగ్రెస్ ఎంపిక కమిటీ అభిప్రాయపడింది.
అమెరికా అంతర్గత విభాగం సంక్షోభంలో ఉన్నట్లు విచారణ సందర్భంగా వెల్లడించారు యవనోవిచ్. విదేశాంగ శాఖ అధికారుల పాత్ర గత కొన్నేళ్లుగా ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు.
ట్రంప్ అభిశంసనకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపిక కమిటిీకి చెందిన ఐదుగురు డెమొక్రాటిక్ సభ్యులు ఆమోదం తెలుపుతూ ఓటు వేశారు.
ఇదీ చూడండి:ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపై సీబీఐ కేసు