అమెరికా హ్యూస్టన్ ఏరియాలోని వాటర్ పార్కులో రసాయన వాయువు లీక్ కావడం వ్లల స్థానిక ప్రజలకు చర్మ, శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. హరికేన్ హార్బర్ స్ప్లాష్‌టౌన్ వద్ద జరిగిన ఈ ఘటనలో.. 29 మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
అయితే.. మరో 39 మంది అంబులెన్స్ సేవలను నిరాకరించినట్లు హారిస్ కౌంటీ ఫైర్ మార్షల్ కార్యాలయం ట్వీట్ చేసింది. ఘటనకు గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: భవిష్యత్లో ప్రపంచానికి పురుగులే ఆహారం!
ఇదీ చూడండి: తుంపర్ల ద్వారా మరో వ్యాధి- అమెరికాలో తొలి కేసు