ETV Bharat / international

ఆ 'గ్యాస్'​ అమ్మి వారానికి రూ.లక్షలు గడిస్తున్న టీవీ స్టార్ - స్టిఫెనీ మ్యాటో

Selling farts in a jar: డబ్బులు సంపాదించడానికి కాదేదీ అనర్హం అన్నట్లు ఓ వింత ఆలోచనతో నెలకు రూ.లక్షలు గడిస్తోంది ఓ టీవీ సెలబ్రిటీ. ఇంతకీ ఆమె చేస్తున్న పని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. అపానవాయువును జార్​లో పెట్టి అభిమానులకు విక్రయిస్తోంది. ఇందుకు సంబంధించి ఈమె షేర్​ చేసిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

90 Day Fiance star selling farts, స్టిఫెనీ మ్యాటో
ఆ గాలి అమ్మి వారానికి రూ.లక్షలు గడిస్తున్న సెలబ్రిటీ
author img

By

Published : Dec 16, 2021, 3:53 PM IST

Updated : Dec 16, 2021, 5:37 PM IST

Selling farts in a jar: అమెరికాలో ఓ టీవీ స్టార్ సోషల్​ మీడియాను ఊపేస్తోంది. ఆమె వారానికి రూ.37లక్షలు ఎలా సంపాదిస్తుందో తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. స్టిఫెనీ మ్యాటో అనే ఈ 31 ఏళ్ల టెలివిజన్​ సెలబ్రిటీ చేస్తున్న పని తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఈమె చేసేదేంటంటే.. అపానవాయువును జార్​లో పెట్టి అమ్మడం. ఔను మీరు విన్నది నిజమే. స్టిఫెనీ 'బాంబులు' వేసే వారానికి లక్షలు గడిస్తోంది. ఆమె అభిమానులు కూడా ఏమాత్రం ఆలోచించకుండా వీటిని తెగ కొనేస్తున్నారు. రెండు రోజుల్లో 97 జార్​లు అమ్ముడయ్యాయంటే వీటికి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది.

90 Day Fiance star selling farts, స్టిఫెనీ మ్యాటో
ఆ గాలి అమ్మి వారానికి లక్షలు గడిస్తున్న సెలబ్రిటీ

ఏదైనా కొత్తగా, ఫన్నీగా ఉండే వ్యాపారం చేయాలని అనుకుంటున్న సమయంలో ఈ ఆలోచన తనకు వచ్చిందని స్టిఫెనీ చెబుతోంది. అపానవాయువును జార్​ పెట్టి అందులో పూల రేకులను ఉంచి ప్యాక్​ చేస్తోంది. ఇలా చేస్తే పూల రేకులు అపానవాయును కూడా సువాసన వచ్చేలా చేస్తాయని వివరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా 66లక్షల మంది వీక్షించారు.

90 Day Fiance star selling farts

'90 డేస్ ఫియాన్స్' టీవీ షోతో స్టిఫెనీ తెగ పాపులర్ అయింది. అనంతరం ఆమె స్వతహాగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. అందులోనే ఈ వివరాలను వెల్లడించింది. తన ధరించిన బ్రాలు, ప్యాంటీలు, దుస్తులు, సబ్బులు సహా ఇతర వస్తువులు కావాలని తన అభిమానుల నుంచి వందల సంఖ్యలో సందేశాలు వచ్చాయని స్టిఫెనీ మ్యాటో వెల్లడించింది. ఇప్పటికే 97 అపానవాయువు జార్​లు విక్రయించినట్లు తెలిపింది. అంతేకాదు అభిమానులకు ధర విషయంలో భారం కాకూడదని డిస్కౌంట్​తో కలిపి ఓక్కో జార్​ను 1000 డాలర్లకు విక్రయిస్తోంది.

Stephanie Matto News

అపానవాయువు ఎక్కువ విడుదల కావడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటుందో కూడా వీడియోలో వివరించింది స్టిఫెనీ. బీన్స్, ప్రొటీన్ మఫిన్, గట్టిగా ఉడికించిన గుడ్లు, ప్రొటీన్ షేక్, పెరుగు వంటివి ఆరగిస్తున్నట్లు చెప్పింది. మొదట పబ్లిసిటీ స్టంట్ కోసమే స్టిపెనీ ఈ ఆలోచన చేసినా.. ఇప్పుడే అదే ఆమెకు కనకవర్షం కురిపించడం గమనార్హం.

Selling farts in a jar 90 day fiance

స్టిఫెనీకి ఇప్పటికే కొంతమంది నుంచి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆమె ఇంటి అడ్రస్ తెలిసిన పలువురు దుండగులు ఆమెను వేధించారు. అప్పటి నుంచి ఇంటి కాపలాను పటిష్ఠం చేసింది. ఎప్పుడూ బియర్ స్ప్రేను దగ్గర పెట్టుకుంటోంది. ఆంగుతుకులు వస్తే దాడి చేస్తే శునకాన్ని గేటు వద్ద ఉంచుతోంది. అంతేకాదు గన్ లైసెన్స్​ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.

ఈ ఏడాది మార్చిలో బ్రూక్లిన్​కు చెందిన ఓ ఫిల్మ్​ డైరెక్టర్ కూడా ఇదే తరహా ఆలోచన చేశాడు. 'బాంబుల' శబ్దాలను రికార్డు చేసి 85డాలర్లకు విక్రయించాడు.

ఇదీ చదవండి: 'ఒమిక్రాన్​ వ్యాప్తి 70రెట్లు ఎక్కువ.. కానీ ఆ విషయంలో మాత్రం వీక్!'

Last Updated : Dec 16, 2021, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.