ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​ను అమెరికా కనిపెడుతుంది: ట్రంప్ - karona vaccine

కరోనా వ్యాక్సిన్​ కోసం విశేష కృషి చేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. 211 చికిత్సా విధానాలను ప్రయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో మరి కొన్ని వారాల్లో కరోనాకు వ్యాక్సిన్​ కనిపెడతామని విశ్వాసం వ్యక్తం చేశారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.

72-active-trials-underway-across-us-on-coronavirus-trump
కరోనా వ్యాక్సిన్​ను అమెరికా కనిపెడుతుంది: ట్రంప్
author img

By

Published : Apr 21, 2020, 11:46 AM IST

Updated : Apr 21, 2020, 12:21 PM IST

మందుమాకూ లేని మహమ్మారి​కి విరుగుడు కనిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది అమెరికా. ఇందుకోసం​ డజన్ల కొద్దీ ప్రయోగాలు చేపట్టింది. యూఎస్​లో 72 క్రియాశీల పరీక్షలు జరుగుతున్నాయని, కరోనాను నియంత్రించే వ్యాక్సిన్లను రూపొందించేందుకు శాస్త్రవేత్తలు విపరీతంగా కృషి చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

కొవిడ్​ను పూర్తిగా నివారించే చికిత్సా విధానాలను రూపొందిస్తున్నామని ట్రంప్​ స్పష్టం చేశారు.

"ఈ సంక్షోభం మొదలైన రోజు నుంచే అమెరికా పరిశోధనలు ప్రారంభించింది. సంయుక్త అమెరికా దేశాల్లో ప్రస్తుతం 72 క్రియాశీల పరీక్షలు జరుగుతున్నాయి. మరో 211 చికిత్సా విధానాలను ప్రయోగించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం.. వ్యాక్సిన్​ తయారీలో పురోగతి కనిపిస్తోంది. ఈ విషయంలో మంచి పరిణామాలు జరుగుతున్నాయి. మీరు చూస్తూ ఉండండి.. మరి కొన్ని వారాల్లోనే, మనం (అమెరికా) కరోనాకు విరుగుడు గురించి మాట్లాడతాం. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు."

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

మలేరియాకు విరుగుడుగా వినియోగించే ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్​ను కరోనా చికిత్సకు వినియోగించాలని పదేపదే చెప్పిన ట్రంప్​.. నిన్న జరిగిన శ్వేతసౌధ సమావేశంలో మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించలేదు.

ఇదీ చదవండి:ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ పరిస్థితి విషమం!

Last Updated : Apr 21, 2020, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.