అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఓ బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దారిలో వెళ్తున్న మూడు ట్రాక్టర్లు, ఓ కారుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూజెర్సీలోని రాక్వే నుంచి ఒహియోలోని సిన్సినాటి వైపు వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన వారిలో 7 నుంచి 67 సంవత్సరాల వయసు కలవారు ఉన్నారు. మరణించిన వారిలో ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు. మిగిలిన ముగ్గురు మృతుల వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు పోలీసులు.