ETV Bharat / international

కొవిడ్‌ చికిత్సకు మరో 21 మందులు!

author img

By

Published : Jul 26, 2020, 10:51 AM IST

కరోనా మహమ్మారిపై మంచి ఫలితాలు ఇస్తోన్న రెమ్​డిసివిర్​, క్లోరోక్విన్​ లాంటి మరో 21 ఔషధాలను గుర్తించారు అమెరికాలోని స్టాన్​ఫోర్డ్​ శాస్త్రవేత్తలు. ఇవి కొవిడ్ కారక సార్స్​-కోవ్​-2పై మెరుగ్గా పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ పరిశోధనలో దాదాపు 12 వేల ఔషధాలను పరిశీలించినట్లు చెప్పారు.

21 more drugs for Covid-19 virus
కొవిడ్‌-19కు మరో 21 మందులు!

కరోనా వైరస్‌ నిరోధానికి ఏ ఔషధం పనిచేస్తుందన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెమ్‌డిసివిర్‌, క్లోరోక్విన్‌ లాంటి ఔషధాలను గుర్తించారు. ఇప్పుడు కొత్తగా మరో 21 ఔషధాలు కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2పై పనిచేస్తాయని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ బర్న్‌హామ్‌ ప్రిబైస్‌ మెడికల్‌ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

12 వేల నుంచి..

ఈ పరిశోధనలు తుదిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం వాడకంలో ఉన్న 12,000 ఔషధాలను పరిశీలించిన తర్వాత అందులో 21 ఔషధాలకు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగల లక్షణాలున్నాయని వీరు నిర్ధరించారు. ఇందులో నాలుగు ఔషధాలను ఇప్పటికే కరోనా చికిత్సలో వాడుతున్న రెమ్‌డిసివిర్‌తో కలిసి వాడొచ్చని పేర్కొన్నారు. ఈ పరిశోధన అంశాలను 'నేచర్‌' పత్రిక ప్రచురించింది.

"కరోనా బాధితుడు కోలుకునే సమయాన్ని రెమ్‌డిసివిర్‌ తగ్గించింది. కాకపోతే ఈ ఔషధం అందరిపైనా పని చేయడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెమ్‌డిసివిర్‌తో కలిసి వాడే ఔషధాలను కనిపెడుతున్నాం. 21 ఔషధాలను గుర్తించాం."

- సుమిత్‌ చంద్ర, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త

ఇదీ చూడండి: కొవిడ్‌ లక్షణాలను వేగంగా గుర్తించే చేతి పట్టీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.