ETV Bharat / international

బ్రెజిల్​లో వరదలు.. 21మంది మృతి - floods affected areas of brazil

బ్రెజిల్​లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సావో పౌలో, రియో డి జెనిరో రాష్ట్రాల్లోని వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడి 21 మంది మృతి చెందారు. 32 మంది ఆచూకీ గల్లంతయ్యింది. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు.

brazil
బ్రెజిల్​లో వరదలు.. 21మంది మృతి
author img

By

Published : Mar 4, 2020, 11:20 AM IST

Updated : Mar 4, 2020, 1:51 PM IST

బ్రెజిల్​లో వరదలు

బ్రెజిల్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో సావో పౌలో, రియో డీ జెనిరో రాష్ట్రాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. మృతుల్లో 16మంది సావో పౌలో, ఐదుగురు రియో డి జెనిరోకు చెందినవారు. 32 మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.

సాధారణంగా బ్రెజిల్‌లో నెల రోజుల వ్యవధిలో కురిసే వర్షం కొద్ది గంటల వ్యవధిలో కురవడమే ఈ వరదలకు కారణమని ఆ దేశ వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో హైవేలపై రాకపోకలను నిషేధించారు అధికారులు. ఐదువేలమందిని ఇళ్లనుంచి బయటకు రప్పించారు.

ఈ ఏడాది బ్రెజిల్​ ఈశాన్య ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి.

ఇదీ చూడండి: అమెరికాలో అగ్నిప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు

Last Updated : Mar 4, 2020, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.