ETV Bharat / international

జైళ్లలో కరోనా విజృంభణ-2,000 మంది ఖైదీలకు పాజిటివ్​? - america latest news

జైళ్లలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అగ్రరాజ్యంలో 2,000 మంది ఖైదీలకు పాజిటివ్​గా తేలింది. 31మందిని బలిగొంది. కరోనా వైరస్‌ సోకిన ఖైదీల సమాచారంపైన అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

2000 prisoners tested corona positive in US
జైళ్లలో కరోనా విజృంభణ
author img

By

Published : Apr 30, 2020, 3:25 PM IST

అమెరికాలోని పలు జైళ్లలో సుమారు 2 వేల మంది ఖైదీలకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిందని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ప్రిజన్స్‌ వెల్లడించింది. కరోనా పరీక్షలు నిర్వహించిన 2700 మందిలో 2000 మంది వైరస్‌ బారిన పడ్డారని తెలిపింది.

దేశవ్యాప్తంగా అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే ఆ దేశంలో 60 వేల మందికిపైగా మృతిచెందారు. ఇంకా వేల సంఖ్యలో బాధితులవుతున్నారు. అదే సమయంలో అక్కడి కారాగారాల్లో సైతం వైరస్‌ తీవ్రత పెరిగింది. దీంతో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ప్రిజన్స్‌ పరిధిలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న సుమారు 1,50,000 ఖైదీల పరిస్థితిపై న్యాయవాదులు, చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, బయటి కంటే జైళ్లలోనే పరిస్థితులు బాగున్నాయని ఫెడరల్‌ బ్యూరో పేర్కొంది.

మరోవైపు కరోనా వైరస్‌ సోకిన ఖైదీల సమాచారంపైనా ఆ శాఖ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలూ వస్తున్నాయి. ఖైదీలెవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే సంబంధిత కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది, ఇటీవల మైఖేల్‌ అనే ఓ ఖైదీ కరోనా వైరస్‌ బారిన పడ్డా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు. ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లింది, పరిస్థితి విషమించిన సమాచారం కూడా జైలు అధికారులు వారికి చెప్పలేదు. చివరికి మైఖేల్‌ చనిపోయాక అంత్యక్రియల విషయంపై వారితో సంప్రదింపులు చేశారు. తమ తండ్రి కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయామని మైఖేల్‌ కుమారుడు ఫ్లెమింగ్‌ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వద్ద వాపోయాడు. తన తండ్రి మృతికి గల కారణం కూడా వార్తల్లో చూసి తెలుసుకోవాల్సి వచ్చిందని ఆవేదన చెందాడు.

31 మంది ఖైదీలు మృతి

విపత్కర పరిస్థితుల్లోనూ వీలైనంత మేరకు బాగానే పనిచేస్తున్నామని, అలాగే సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఆదేశాలను కచ్చితంగా పాటిస్తున్నామని జైలు అధికారులు చెబుతున్నారు. బుధవారం నాటికి 31 మంది ఖైదీలు కరోనాతో మృతిచెందారు. మరోవైపు జైలు అధికారులు రోజూ సీడీసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీడీసీ బృందాలు కూడా అనేక జైళ్లను సందర్శించి కరోనా వైరస్‌ నివారణకు పలు సూచనలు చేశాయి. దీంతో ఆయా కారాగారాల్లో ఖైదీల మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానుతులు ఎవరైనా ఉంటే వారిని ఐసోలేట్‌ చేస్తున్నారు. ఇక ఖైదీలకు సంబంధించి 20 వెంటిలేటర్లు సమకూర్చామని, 5 వేల టెస్టు కిట్లు, 20 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ మెషీన్లు అందుబాటులోకి తెచ్చామని బ్యూరో ఆఫ్‌ ప్రిజన్స్‌ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.