ETV Bharat / international

భారతీయ అమెరికన్ల ఆర్థిక స్థిరత్వంపై కరోనా ఎఫెక్ట్​ - భారతీయ అమెరికన్లు

కరోనా వైరస్​ సంక్షోభం అమెరికాను కుదిపేసింది. ముఖ్యంగా భారతీయ అమెరికన్లపై తీవ్ర ప్రభావం పడింది. ప్రతి ఐదుగురిలో ఇద్దరు.. తమ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో భారతీయ అమెరికన్లపై జరిగిన సర్వేలో ఈ విషయం తేలింది.

2 in 5 Indian-Americans worried about financial stability, says first-of-its-kind survey
భారతీయ అమెరికన్ల ఆర్థిక స్థిరత్వంపై కరోనా ఎఫెక్ట్​
author img

By

Published : Jun 28, 2020, 2:06 PM IST

కరోనా సంక్షోభంతో ప్రతి ఐదుగురిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు.. తమ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనపడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. అయితే దాదాపు అందరూ తమ జీవనశైలిని మార్చుకుంటున్నట్టు పేర్కొంది.

కరోనా వైరస్​ నేపథ్యంలో భారతీయ అమెరికన్​ సంఘంపై సర్వే జరగడం ఇదే తొలిసారి. ఫౌండేషన్​ ఫర్​ ఇండియా అండ్​ ఇండియన్​ డయాస్పొర స్టడీస్​(ఎఫ్​ఐఐడీఎస్​) ఈ సర్వే చేపట్టింది.

సర్వే ప్రకారం.. 30శాతం మంది.. తమ ఉద్యోగాలు, ఇంటర్న్​షిప్​పై కరోనా సంక్షోభం ప్రభావం పడిందని పేర్కొన్నారు. ప్రతి ఆరుగురిలో ఒక్కరికి కరోనా పాజిటివ్​గా తేలిన లేదా వైరస్​ నిర్ధరణ అయిన వారి కుటుంబ సభ్యుల వివరాలు తేలుసుకోవడం జరిగింది.

సర్వేలోని మరిన్ని విషయాలు...

  • ప్రతి ఆరుగురిలో ఐదుగురి కుటుంబ సంబంధాలపై కరోనా సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపలేదు.
  • ప్రతి నలుగురిలో ఒకరు ఒత్తిడికి లోనయ్యారు.
  • సంఘంలోని కొద్ది మంది మాత్రమే వలస సమస్యలను ఎదుర్కొన్నారు.
  • అగ్రరాజ్యం జనాభాకు మాస్కులు, ఆహార పొట్లాలు, వైద్య సేవలు అందించడానికి చాలా మంది భారతీయ అమెరికన్లు తమ శక్తికి మించిన కృషి చేశారు.

ఇదీ చూడండి:- వాషింగ్టన్​ అత్యున్నత కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.