ETV Bharat / international

ఎఫ్​బీఐ ఏజెంట్లపైనే కాల్పులు- ఇద్దరు మృతి - search warrant

అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ కేసులో సర్చ్​​ వారెంట్​ జారీ చేయడానికి వెళ్లిన ఆ దేశ అత్యున్నత దర్యాప్తు విభాగం(ఎఫ్​బీఐ) ఏజెంట్లపైనే కాల్పులు జరిపాడు దుండగుడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. అనంతరం.. నిందితుడిని హతమార్చారు.

author img

By

Published : Feb 3, 2021, 5:15 AM IST

సర్చ్​​ వారెంట్​ జారీ చేసేందుకు వెళ్లిన అమెరికా అత్యున్నత దర్యాప్తు విభాగం(ఎఫ్​బీఐ) అధికారులపైనే కాల్పులు జరిపాడు దుండగుడు. ఈ ఘటనలో ఇద్దరు ఎఫ్​బీఐ ఏజెంట్లు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని సమీప ఆస్పత్రులకు తరలించారు.

చిన్నపిల్లలపై హింస సహా ఇతర ఆకృత్యాలకు పాల్పడిన కేసులో నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు.. అతడిపై సర్చ్​ వారెంట్​ జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడి ఇంటికి వెళ్లగా లోపలినుంచే ఎఫ్​బీఐ ఏజెంట్లపై కాల్పులు జరిపాడు. దీంతో.. అక్కడికి ఒక్కసారిగా భారీగా పోలీసులు చేరుకున్నారు. సమీప ఇళ్లలోని ప్రజలను బయటకు రావొద్దని సూచించారు.

ఎదురుకాల్పుల అనంతరం.. నిందితుడిని హతమార్చినట్లు వెల్లడించారు పోలీసులు. అయితే.. ఈ ఘటనలో ఇద్దరు ఎఫ్​బీఐ ఏజెంట్లూ ప్రాణాలు కోల్పోయారు.

మరోచోట ఘోరం..

అంతకుముందు.. ఓక్లహోమాలో ఘోరం జరిగింది. మస్కోగీలోని ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.

ఇదీ చూడండి: అమెరికాలో కాల్పులు- ఐదుగురు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.