కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు వినూత్న ఆలోచన చేశారు అమెరికాలోని కాలిఫోర్నియా గవర్నర్ గవీన్ న్యూసోమ్. రాష్ట్రంలో కొవిడ్ టీకా తీసుకున్న 10 మంది అదృష్టవంతులకు 15 మిలియన్ డాలర్లు బహుమతిగా అందించారు. కాలిఫోర్నియాలో కరోనా నిబంధనలను సడలించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవీన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మొత్తం 10 మంది అదృష్టవంతులకు ఒక్కొక్కరికి 1.5 మిలియన్ డాలర్లను అందజేశారు. ఈ లాటరీ కార్యక్రమంలో దాదాపు 2 కోట్లమందికిపైగా పాల్గొన్నారు.
దేశంలోనే అత్యల్పం..
ప్రజలందరూ టీకాలు వేసుకోవాలన్న ఉద్దేశంతో.. 'వ్యాక్స్ ఫర్ ది విన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు గవర్నర్. ప్రస్తుతం కాలిఫోర్నియాలో.. అమెరికాలోనే అత్యల్ప పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అక్కడ దాదాపు 70 శాతానికి పైగానే వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఇదీ చదవండి : టీకా జాక్‌పాట్- లక్కీగా వరించిన వ్యాక్సిన్