ETV Bharat / international

83 వారాల తర్వాత స్కూల్స్ రీఓపెన్​- నగరమంతా ట్రాఫిక్​ జామ్​! - Uganda schools reopen

Uganda Schools Reopen: ఉగాండాలో కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలు దాదాపు రెండేళ్ల తర్వాత తెరుచుకున్నాయి. మరోవైపు కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో నేపాల్​లో ఈనెల 31 వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

uganda
83 వారాల తర్వాత స్కూల్స్ రీఓపెన్
author img

By

Published : Jan 10, 2022, 11:35 PM IST

Uganda Schools Reopen: కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పాఠశాలలు మూతపడి ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి ఆఫ్రికా దేశమైన ఉగాండా రికార్డ్​ సృష్టించింది. కొవిడ్​ కారణంగా ఉగాండాలోని పాఠశాలలకు దాదాపు 83 వారాలు అంతరాయం ఏర్పడింది. మహమ్మారి ప్రభావంతో సుదీర్ఘ కాలం పాఠశాలలు మూతపడ్డ దేశంగా నిలిచింది. అయితే తాజాగా దేశవ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభానికి ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.

సోమవారం నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అందరూ బడి బాట పట్టారు. దీంతో ఆ దేశ రాజధాని అయిన కంపాలాలో భారీగా ట్రాఫిక్​ స్తంభించింది. కానీ ఇటీవల ఆ దేశంలో మరోసారి ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు నమోదుకావడం వల్ల ఈ పాఠశాలలు ఎంతకాలం కొనసాగుతాయనే విషయం ఆసక్తికరంగా మారింది.

నేపాల్​లో బంద్​..

కరోనా కారణంగా నేపాల్​లో పాఠశాలలు మూతపడ్డాయి. ఈనెల 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

స్వీడన్​లో ఆంక్షలు..

కరోనా ఆంక్షలను కట్టుదిట్టం చేసింది స్వీడన్. కేఫ్​, బార్లు, రెస్టారెంట్లకు రాత్రి 11 వరకే అనుమతిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు సాధ్యమైనంత వరకు వర్క్​ఫ్రం హోమ్​కే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. వైరస్​ను అదుపు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.

'30 శాతం మరణాలు వారివే..'

సింగపూర్​లో 2021లో నమోదైన కొవిడ్​ మరణాల్లో 30 శాతం పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ పొందినవారివేనని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్​ యీ కుంగ్​ సోమవారం వెల్లడించారు. 802 మంది మృతుల్లో 247 మంది పూర్తి స్థాయిలో టీకా తీసుకున్నట్లు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది ఎమ్​ఆర్​ఎన్​ఏ కాకుండా వేరే వ్యాక్సిన్లు తీసుకున్నారని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్​ కన్నా ఒమిక్రాన్​ ఎన్నో రెట్లు ప్రమాదకరమైనదని అన్నారు ఓంగ్​ యీ కుంగ్. రోజుకు సగటున డెల్టాకు 3000 కేసులు నమోదైతే.. ఒమిక్రాన్​లో ఆ సంఖ్య 10వేల నుంచి 15వేల దాకా ఉంటుందని తెలిపారు.

ఫిలిప్పీన్స్​లో భారీగా కరోనా..

ఫిలిప్పీన్స్​లో మరోసారి భారీగా కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. కొత్తగా 33,169 కేసులు వెలుగుచూశాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం వరుసగా ఇది మూడోరోజు. పాజిటివిటీ రేటు 46 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన 145 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 52,293కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 29,98,530గా ఉంది.

ఇండోనేసియాలో బూస్టర్లు..

బూస్టర్​ డోసు కోసం ఇండోనేసియా ఐదు కొత్త టీకాలకు ఆమోదం తెలిపింది. సినోవాక్​, ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జిఫివాక్స్​ టీకాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి : అమెరికాలో 61మిలియన్లు దాటిన కేసులు- ఫ్రాన్స్​లో ఆగని ఉద్ధృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.