ప్రపంచంలో టైటానిక్ అంటే తెలియనివారు ఉండరు. కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్‌కు దక్షిణాన 596 కి.మి దూరంలో ఈ ఓడ అవశేషాలను సందర్శించింది ఓ జలాంతర్గామి బృందం. గత 14 ఏళ్లలో టైటానిక్ శిథిలాల వద్దకు వెళ్లడం ఇదే తొలిసారి.
జలాంతర్గామి పైలట్ విక్టర్ వెస్కొవొ నేతృత్వంలోని బృందం ప్రత్యేక నౌకలో టైటానిక్‌ను సందర్శించి అధ్యయనం చేసింది. దాని చుట్టూ పేరుకుపోయిన బ్యాక్టీరియాను సేకరించి పరిశోధనలు జరిపారు శాస్త్రవేత్తలు.
లోహాలను తినే సహజసిద్ధమైన ఈ బ్యాక్టీరియా వల్ల భవిష్యత్తులో టైటానిక్ అవశేషాలు వేగంగా కనుమరుగైపోతాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రజ్ఞులు.
టైటానిక్ అవశేషాలను సందర్శించిన దృశ్యాలను వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతతో బంధించారు.
ఇంగ్లాండు లోని సాథాంప్టన్ నుంచి 1912 ఏప్రిల్ 10న టైటానిక్ ఓడ న్యూయార్క్ నగరానికి బయలుదేరి సముద్రం మధ్యలో మునిగిపోయింది. దాదాపు 1500మంది జలసమాధి అయ్యారు.
ఇదీ చూడండి : 'భాజపా ట్రబుల్ షూటర్‌గా జైట్లీ ముద్ర ప్రత్యేకం'
.